For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒలింపిక్స్‌లో క్రికెట్.. బీసీసీఐ హింట్.. ఎప్పుడంటే?

BCCI Secretary Jay Shah says Once Cricket is Added to Olympics, India Will be Participating
Indian Cricket Team Will Participate In The Olympics, Confirms BCCI || Oneindia Telugu

న్యూఢిల్లీ: 2020 విశ్వ క్రీడల సంబరానికి తెర పడింది. అన్ని అవరోధాలను అధిగమించి రెండు వారాల పాటు ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రేమికులను మురిపించిన టోక్యో ఒలింపిక్స్‌ ఆదివారం ఘనంగా ముగిశాయి. ఏడాది పాటు వాయిదా పడి ఒకదశలో అసలు జరుగుతాయా లేదా అనే సందేహాలు రేకెత్తినా... అడ్డంకి లేకుండా ఆటలు కొనసాగడం విశేషం. టోక్యో గవర్నర్‌ యురికో కొయికె ఒలింపిక్‌ జెండాను వచ్చే ఒలింపిక్స్‌ జరిగే పారిస్‌ మేయర్‌ అనె హిడాల్గోకు అందించడంతో విశ్వక్రీడల లాంఛనం పూర్తయింది.

అంగరంగ వైభవంగా జరిగిన ఈ మెగాఈవెంట్‌లో క్రికెట్ లేకపోవడం భారత అభిమానులను నిరాశపరిచింది. దీంతో జెంటిల్మెన్​ గేమ్​ను కూడా విశ్వక్రీడల్లో చేరిస్తే బాగుంటుందనే అభిప్రాయం చాలా రోజులుగా వ్యక్తమవుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో ఆ ముచ్చట కూడా తీరనుంది. ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ) ఫ్యాన్స్‌కు హింట్ ఇచ్చింది.

రెండు జట్లు పాల్గొంటాయి..

రెండు జట్లు పాల్గొంటాయి..

తాజాగా ఒలింపిక్స్‌లో క్రికెట్ చేర్చే విషయంపై బీసీసీఐ సెక్రటరీ జై షా స్పందించారు. అన్ని అనుకున్నట్లు సవ్యంగా జరిగితే మరికొద్ది రోజుల్లో విశ్వక్రీడల్లో క్రికెట్ చూస్తామని వెల్లడించారు. ఐసీసీతో కలిసి బీసీసీఐ కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఇక ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలని గతంలోనే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంతో ఐసీసీ చర్చలు జరిపింది. కానీ, అప్పుడు బీసీసీఐ దీనికి సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో ఆ ప్రయత్నాలు అర్ధంతరంగా ముగిశాయి. కానీ, ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టత ఇచ్చారు. క్రికెట్​ విశ్వక్రీడల్లో భాగమైతే భారత్​ పాల్గొంటుందని స్పష్టం చేశారు. ఇందులో ఐసీసీతో కలిసి సాగుతామని పేర్కొన్నారు.

8 టీమ్‌లతో...

8 టీమ్‌లతో...

'టోక్యో ఒలింపిక్స్​లో భారత బృందం ప్రదర్శనపై బీసీసీఐ సంతోషంగా ఉంది. దీంతో బీసీసీఐ తన వైఖరిని మార్చుకుంది. విశ్వక్రీడల్లో క్రికెట్ భాగమైతే ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని.. భారత్​కు మరిన్ని పతకాలు రావడానికి కృషి చేయాలని బోర్డు భావిస్తున్నట్లు'ఆ అధికారి ఒకరు తెలిపారు. భారత పురుష, మహిళల జట్లు పాల్గొంటాయన్నారు. .లాస్​ ఏంజెలెస్​​ ఒలింపిక్స్​లో ఐసీసీ ఎనిమిది జట్లను బరిలో దించే అవకాశముంది. ప్రస్తుతమైతే టీ20 మ్యాచ్​లు నాలుగు గంటల్లో ముగుస్తున్నాయి. 2028 వరకు వీలైతే ఒలింపిక్స్ కోసం టీ10 తరహాలో అతి చిన్న ఫార్మాట్​ను కూడా సృష్టించొచ్చు.

గతంలో ఏకైక మ్యాచ్..

గతంలో ఏకైక మ్యాచ్..

1900 పారిస్ ​ఒలింపిక్స్​లో ఏకైక క్రికెట్​ మ్యాచ్​ను​ నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్​-ఫ్రాన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రెండు హాఫ్ సెంచరీలు, రెండు ఐదు వికెట్ల ఘనతలు నమోదయ్యాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 366 రన్సే చేశాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మ్యాచ్‌లో 12 మంది చొప్పున 24 మంది ప్లేయర్లు బరిలోకి దిగారు. అందులో 22 మందికి గతంలో తమ దేశాల తరఫున, ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన అనుభవం కూడా లేదు. కేవలం ఇద్దరు మాత్రమే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు. రెండ్రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్​లో గ్రేట్​ బ్రిటన్​ 158 పరుగుల తేడాతో గెలుపొంది స్వర్ణ పతకం అందుకుంది. ఓడిపోయిన ఫ్రాన్స్​ టీమ్​కు రజతం దక్కింది. అయితే 12 మంది ఆటగాళ్లతో బరిలోకి దిగడంతో ఈ మ్యాచ్‌‌కు కనీసం ఫస్ట్ క్లాస్ హోదా కూడా ఇవ్వలేదు.

అందుకే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ లేదు

అందుకే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ లేదు

1900 ఒలింపిక్స్​ తర్వాత సమ్మర్ గేమ్స్‌ నుంచి క్రికెట్​ను తొలగించారు. విశ్వక్రీడల్లో ఆదిపత్యం చెలాయించే అమెరికా, రష్యా, చైనా, జర్మనీ, జపాన్​ లాంటి దేశాలు.. ఈ ఆటపై పెద్దగా ఆసక్తి చూపకపోవడం, అలానే ఓ క్రికెట్ మ్యాచ్​ కోసం దాదాపు 4-5 గంటల కంటే ఎక్కువ సమయం ​వెచ్చించాల్సి రావడం ఈ ఆటను విస్మరించడానికి కారణంగా కనిపిస్తోంది. ఒలింపిక్స్​ ఆతిథ్య దేశాల్లో చాలావరకు క్రికెట్ స్టేడియాలు ఉండవు. ప్రత్యేకించి దీని కోసమే స్టేడియాలు నిర్మించి, వాటిని నిర్వహించడం వల్ల ఆతిథ్య దేశాలకు ఆర్థిక భారం పెరగొచ్చు. ఇక క్రికెట్ ఆడే దేశాల సంఖ్య తక్కువగా ఉండటం కూడా విశ్వక్రీడల్లో చోటు దక్కకపోవడానికి కారణంగా తెలుస్తోంది. ఈ కారణాల వల్లనే ఒలింపిక్స్​లో క్రికెట్​ను పెట్టాలనే ఆలోచనను పూర్తిగా విరమించుకున్నారు.

Story first published: Monday, August 9, 2021, 20:18 [IST]
Other articles published on Aug 9, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+