Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గౌతమ్ గంభీర్ టీమ్‌లో భారీ మార్పులు.. ఆ ఇద్దరూ ఔట్!

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని సపోర్ట్ స్టాఫ్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటేతో పాటు ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ తమ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇంగ్లండ్ పర్యటనతోనే ఈ ఇద్దరి కాంట్రాక్ట్ ముగిసిందని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు. వారి కాంట్రాక్ట్‌లను పొడిగించేది లేదని స్పష్టం చేశారు. వారి స్థానాల్లో కొత్త కోచ్‌లను నియమిస్తామని వెల్లడించారు.

తప్పుకోలేదు తప్పించాం: బీసీసీఐ

'గతేడాదే దిలీప్ కాంట్రాక్ట్‌‌ ముగియగా.. మరో ఏడాది పొడిగిస్తూ అవకాశం ఇచ్చాం. ర్యాన్ టెన్ డస్కాటే కాంట్రాక్ట్ జూన్ 10నే ముగిసింది. అయినా భారత్-ఇంగ్లండ్ సిరీస్ ముగిసే వరకు అతను కొనసాగాడు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంట్రాక్టులను పొడిగించే ఉద్దేశం మాకు లేదు. వారిని జట్టు నుంచి తప్పించాం.

గంభీర్, అయ్యర్‌ను కాదు.. ఆ అరడజను దొంగలను తరిమేయండి: సంజయ్ మంజ్రేకర్

గంభీర్, అయ్యర్‌ను కాదు.. ఆ అరడజను దొంగలను తరిమేయండి: సంజయ్ మంజ్రేకర్

ర్యాన్ టెన్ డస్కాటే రాజీనామా చేసినట్లు ప్రచారం జరిగింది. కానీ అందులో వాస్తవం లేదు. అతని కాంట్రాక్ట్‌ను పొడిగించకపోవడంతోనే తప్పుకున్నాడు. ఈ ఇద్దరి స్థానాల్లో కొత్త వారిని నియమిస్తాం. ఆ ప్రక్రియ మొదలైంది. మరో రెండు రోజుల్లో కొత్త కోచ్‌ల వివరాలను వెల్లడిస్తాం'అని సైకియా మీడియాకు తెలిపారు.

BCCI secretary Devajit Saikia confirms India coaches T Dilip and Ryan Ten Doeschat contracts came to an end


కేకేఆర్ హెడ్ స్ట్రాటజీగా..

మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ నుంచి ర్యాన్ టెన్ డస్కాటేకు భారీ ఆఫర్ వచ్చిందని, ఆ జట్టు క్రికెట్ స్ట్రాటజీ హెడ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడని క్రిక్ బజ్ పేర్కొంది. కేకేఆర్‌తో పాటు ఆ జట్టుకు చెందిన ఇతర ఫ్రాంచైజీలకు కావాల్సిన విదేశీ ఆటగాళ్లను గుర్తించడం, వ్యూహాలు రచించడం వంటి పనులను పర్యవేక్షిస్తాడని తెలిపింది.

దిలీప్.. వాట్ ఆర్ యు డూయింగ్..?

దిలీప్.. వాట్ ఆర్ యు డూయింగ్..?

ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో భారత్ ఓటములకు చెత్త ఫీల్డింగే కారణం. దాంతోనే టీ దిలీప్‌పై బీసీసీఐ వేటు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అతని స్థానంలో బీసీసీఐ సెంట్రల్ ఎక్స్‌లెన్స్(సీఓఈ)లోని ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్‌ను నియమించే అవకాశాలు ఉన్నాయి. జింబాబ్వే పర్యటనలో అతను టీమిండియాకు ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందించాడు.

ముగిసిన దిలీప్‌ 5 ఏళ్ల ప్రస్థానం.

హైదరాబాద్‌కు చెందిన టీ దిలీప్.. 2021లో టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో మెరుగైన పనితీరు కనబర్చాడు. వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో ఫైనల్ చేరడంతో పాటు 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలవడంలో ఫీల్డింగ్ కోచ్‌గా దిలీప్ కీలక పాత్ర పోషించాడు.

బీసీసీఐ ఆఫర్‌ను తిరస్కరించిన గంభీర్ అసిస్టెంట్!

బీసీసీఐ ఆఫర్‌ను తిరస్కరించిన గంభీర్ అసిస్టెంట్!

సూర్యకుమార్ యాదవ్ ఐకానిక్ క్యాచ్‌తో టీమిండియా 2024 టీ20 ప్రపంచకప్ గెలవడం దిలీప్ కెరీర్‌‌కు హైలైట్ అని చెప్పవచ్చు. బెస్ట్ ఫీల్డింగ్ కోచ్ అవార్డు‌ను ప్రవేశ పెట్టి ఆటగాళ్లను అత్యుత్తమ ఫీల్డర్లుగా దిలీప్ తీర్చిదిద్దాడు. కానీ ఐపీఎల్ తర్వాత భారత ఫీల్డింగ్‌ ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. దిలీప్‌తో పాటు డస్కాటే వైదొలిగిన విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Story first published: Wednesday, July 29, 2026, 11:25 [IST]
Other articles published on Jul 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+