డోంట్ వర్రీ.. మీ స్వదేశాలకు చేర్చే బాధ్యత మాదే.. విదేశీ ఆటగాళ్లకు బీసీసీఐ హమీ!

న్యూఢిల్లీ: భారత్‌లో నెలకొన్న కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో భయాందోళనకు గురవుతున్న విదేశీ ఆటగాళ్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అండగా నిలిచింది.
ఈ క్యాష్ రిచ్ లీగ్ ముగిసిన అనంతరం విదేశీ క్రికెటర్లను వారి సొంత దేశాలకు పంపేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చింది. ప్రతీ ఒక్క ఆటగాడు తమ ఇళ్లకు క్షేమంగా చేరిన తర్వాతే టోర్నీ ముగిసినట్లు భావిస్తామని పేర్కొంది. ఈ మేరకు బీసీసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫిసర్ హేమంగ్ అమిన్ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు మెయిల్ చేశాడు.

డోంట్ వర్రీ.. వీ ఆర్ విత్ యూ..
'మీలోని చాలా మంది పడుతున్న ఆవేదన మాకు అర్థమైంది. లీగ్ ముగిసిన తర్వాత స్వదేశాలకు ఎలా వెళ్లాలనే విషయంపై మీరంతా ఆందోళన చెందుతున్నారు. దాని గురించి మీరేమీ బాధ పడాల్సిన అవసరం లేదు. మీరు మీ సొంత దేశాలకు సజావుగా వెళ్లడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తాం. కొవిడ్ పరిస్థితులను చాలా దగ్గరి నుంచి పరిశీలిస్తున్నాం. మేము ప్రభుత్వ వర్గాలతో కలిసి పనిచేస్తున్నాం. మీలోని ప్రతి ఒక్కరూ క్షేమంగా తిరిగి ఇళ్లకు చేరాకే టోర్నీ ముగిసినట్లుగా భావిస్తాం.'అని హేమంగ్ అమిన్ ఆ మెయిల్‌లో స్పష్టం చేశారు.

కాస్తో కూస్తో సంతోషం..
ఇప్పటికే మీరు ఐపీఎల్‌లో ఆడుతూ కొన్ని కోట్ల మందికి వినోదాన్ని అందిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజల దృష్టిని మరల్చేందుకు మీ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజంగా గొప్ప విషయం. ఒక్క నిమిషం పాటైనా ఎవరి ముఖంలోనైనా చిరునవ్వు తీసుకురాగలిగితే మీరు మంచి పని చేసినట్లే. ఈసారి ఆడటం, గెలవడం కంటే సాయం అనే పేరుతో మీరు గొప్ప పని చేస్తున్నారు'అని ఆటగాళ్లలో స్పూర్తి నింపేలా ఆయన వ్యాఖ్యలు చేశారు.

భయానక పరిస్థితులు..
గత కొన్ని రోజులుగా దేశంలో రోజూ 3 లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. భారత్ నుంచి విమాన రాకపోకలను ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధించింది. దీంతో ఆ దేశ క్రికెటర్లలో కలవరం మొదలైంది. దీనిపై కోల్కతా మెంటర్ డేవిడ్ హస్సీ.. ప్రస్తుతం ఇండియాలో నెలకొన్న పరిస్థితులు కొంత ఆందోళనకరంగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు.ముగ్గురు ఆసీస్ ప్లేయర్లు ఆండ్రూ టై(రాజస్థాన్ రాయల్స్), కేన్ రిచర్డ్సన్, ఆడమ్ జంపా(రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు) టోర్నీకి దూరమయ్యారు. త్వరలోనే వార్నర్, స్మిత్ కూడా స్వదేశానికి వెళ్లనున్నారని ప్రచారం జరిగింది. వీరితో పాటు రికీ పాంటింగ్, పాట్ కమిన్స్, సైమన్ కటిచ్తో పాటు ఇంగ్లాండ్, కివీస్, విండీస్ క్రికెటర్లు కూడా ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications