టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భవితవ్యంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇంకొన్నాళ్లు గంభీర్‌ను హెడ్ కోచ్‌గా కొనసాగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు ఓ బోర్డు అధికారి మీడియాకు తెలిపారు. సీనియర్ ఆటగాళ్ల రిటైర్మెంట్‌తో భారత క్రికెట్ సంధి దశలో ఉందని, వచ్చే రెండేళ్లలో రెండు ప్రపంచకప్‌లు జరగనుండటంతో గంభీర్‌కు మరికొంత సమయం ఇవ్వాలని బోర్డు భావిస్తున్నట్లు సదరు అధికారి పేర్కొన్నారు.
సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 0-2తో వైట్‌వాష్‌కు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘోర పరాజయం నేపథ్యంలో గంభీర్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అతని అనాలోచిత నిర్ణయాల కారణంగానే టీమిండియా ఘోర పరాజయాలను మూటగట్టుకుంటుందని మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు మండిపడుతున్నారు. తక్షణమే హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ అనంతరం మైదానంలోనే గంభీర్‌కు ప్రేక్షకుల నుంచి నిరసన సెగ తగిలింది. గౌహతి ప్రేక్షకులు గంభీర్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహమ్మద్ సిరాజ్‌తో పాటు సపోర్ట్ స్టాఫ్ వారించినా అభిమానులు వినలేదు. హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి గంభీర్‌ను తప్పించాలని డిమాండ్ చేశారు.
ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న గంభీర్‌కు కూడా ఇదే తరహా ప్రశ్నలు ఎదురయ్యాయి. తన భవితవ్యంపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకుంటుందని గంభీర్ సూటిగా చెప్పాడు. భారత జట్టు కంటే ఎవరూ గొప్ప కాదని, తాను కూడా జట్టు తర్వాతేనని గంభీర్ మరోసారి స్పష్టం చేశాడు. అయితే జనాలు తాను సాధించి ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, ఇంగ్లండ్ పర్యటన విజయాలను మర్చిపోయారని తెలిపాడు. ఇది కుర్రాళ్ల జట్టు అని, వారికి మరికొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు.
ఈ క్రమంలోనే గంభీర్‌కు మరో ఛాన్స్ ఇవ్వాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. 'గంభీర్ భవిష్యత్తుపై బీసీసీఐ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాలని అనుకోవట్లేదు. ప్రస్తుతం భారత జట్టు ట్రాన్సిషన్ దశలో ఉంది. వచ్చే రెండేళ్లలో టీ20 ప్రపంచకప్ 2026, వన్డే ప్రపంచకప్ 2027 టోర్నీలు జరగనున్నాయి. సౌతాఫ్రికాతో వైట్‌వాష్ గురవ్వడంపై టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు సెలెక్టర్లతో బీసీసీఐ మాట్లాడనుంది. వారి నుంచి వివరణ కోరనుంది.'అని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.