
ఎవడు చెప్పిండు..
అయితే బుమ్రా ప్రపంచకప్ ఆడటం లేదంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. బుమ్రా గాయపడటం నిజమే అయినప్పటికీ- అతను టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ నుంచి ఇంకా వైదొలగలేదన్నాడు. బుమ్రా గాయం నేపత్యంలో ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదన్నాడు. ప్రస్తుతం బెంగళూరులో నేషనల్ క్రికెట్ అకాడమీ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని చెప్పాడు. బుమ్రా ఆడటం లేదని ఎవరు చెప్పారంటూ మీడియాపై అసహనం కూడా వ్యక్తం చేశాడు. ఎన్‌సీఏ నుంచి పూర్తిస్థాయి నివేదిక అందిన తరువాతే బుమ్రా విషయంపై ఓ నిర్ణయానికి వస్తామని స్పష్టం చేశాడు. ఇక బుమ్రా గాయం తీవ్రత ఏంటి? ఎలాంటి గాయమైందనే ప్రశ్నలకు గంగూలీ సమాధానాలు చెప్పలేదు.

అక్టోబర్ 15న తుది నిర్ణయం
బుమ్రా గాయం గురించి ఇన్‌సైడ్ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌తో మాట్లాడిన ఓ బీసీసీఐ అధికారి.. జట్టుతోనే బుమ్రా ఆస్ట్రేలియాకు వెళ్తాడని, అక్టోబర్ 15న అతని గాయంపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు. 'బుమ్రాకు విశ్రాంతి అవసరం. అతని బ్యాక్ ఇంజ్యూరీకి అదే సరైన ఔషదం. ప్రస్తుతం అతను ఎన్‌సీఏ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఫిజియో నితిన్ పటేల్ అతని గాయాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. మేం ఇప్పుడే అతన్ని టీ20 ప్రపంచకప్ నుంచి తప్పించాలనుకోవడం లేదు. అతను జట్టుతో కలిసి ఆస్ట్రేలియా కూడా వెళ్లే అవకాశం ఉంది. అక్కడ కూడా అతని గాయం రికవరీ ప్రాసెస్ కొనసాగనుంది. అక్టోబర్ 15 వరకు వేచి చూసి ఆ రోజే తుది నిర్ణయం తీసుకుంటాం'అని సదరు బీసీసీఐ అధికారి తెలిపాడు.

అక్టోబర్ 6న..
ఇక అక్టోబర్ 4న సౌతాఫ్రికాతో టీ20 మ్యాచ్ ముగిసిన రెండు రోజులకు అక్టోబర్ 6న టీమిండియా ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లనుంది. పెర్త్‌లో మెగాటోర్నీ కోసం సన్నదమవ్వనుంది. బుమ్రా కూడా జట్టుతో వెళ్లనుండగా.. అతనితో రిహాబ్ టీమ్ కూడా ఉండనుంది. అక్టోబర్ 15లోపు అతను పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించకపోతే.. ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంపిక చేయనుంది. ఇప్పటికే స్టాండ్ బై జాబితాలో కొత్తగా ఉమ్రాన్ మాలిక్, మహమ్మద్ సిరాజ్‌లకు అవకాశం కల్పించింది. ఈ ఇద్దరితో పాటు స్టాండ్ బైగా ఉన్న మహమ్మద్ షమీ, దీపక్ చాహర్ కూడా జట్టుతో ఆస్ట్రేలియా వెళ్లనున్నారు.


Click it and Unblock the Notifications












