Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022 Mega Auction రేసులో 1,214 మంది ఆటగాళ్లు.. విదేశీయుల్లో వాళ్లే టాప్

BCCI says 1,214 players register for IPL 2022 Mega Auction, Australia Leads Overseas List
IPL 2022 Mega Auction: 1214 Players Register, 49 Players Base Price At 2 Crore | Oneindia Telugu

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 మెగా వేలంలో 1,214 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొంది క్రికెట్ లీగ్ కావడంతో ఒక్కసారైన ఈ ధనాధన్ లీగ్ ఆడాలని ఆటగాళ్లు కలలుకంటుంటారు. ఈ నేపథ్యంలో ఈ క్యాష్ రిచ్‌ లీగ్‌లో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్న,పెద్ద ఆటగాళ్లంతా ఎగబడ్డారు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో కొత్తగా రెండు జట్లు వచ్చి చేరడంతో మెగా వేలం అనివార్యమైంది. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ ముగించిన బీసీసీఐ.. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మెగా వేలం నిర్వహించే ఏర్పాట్లు చేస్తోంది. క్రికెటర్లంతా మెగా వేలంలో తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకునే గడువు (జనవరి 20) కూడా ముగిసింది.

 ఆసీస్ నుంచి అధిక సంఖ్యలో..

ఆసీస్ నుంచి అధిక సంఖ్యలో..

ఈ నేపథ్యంలో వచ్చే మెగా వేలం కోసం 1,214 మంది ఆటగాళ్లు రిజిస్టర్‌ చేసుకున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. ఇందులో 896 మంది భారతీయ క్రికెటర్లు కాగా.. 318 మంది విదేశీయులు ఉన్నారు. 270 మంది క్యాప్‌డ్‌ (జాతీయ జట్టు తరఫున ఆడినవారు), 903 మంది అన్‌క్యాప్‌డ్ (జాతీయ జట్టుకు ఆడని వారు), 41 మంది అసోసియేట్‌ ప్లేయర్లు రిజిస్టర్‌ చేసుకున్నారు. విదేశీయుల్లో అత్యధికంగా ఆస్ట్రేలియాకు చెందిన 59 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

217 మందికే ఛాన్స్..

ఆ తర్వాత సౌతాఫ్రికా (48), శ్రీలంక (36), ఇంగ్లండ్ (30), న్యూజిలాండ్‌ (29), అఫ్గానిస్థాన్‌ (20) దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. నేపాల్‌ (15), యూఎస్‌ఏ (14), నమీబియా (5), ఒమన్ (3), భూటాన్‌ (1), యూఏఈ (1), నెదర్లాండ్స్‌ (1), స్కాట్లాండ్‌ వంటి అసోసియేట్ దేశాల ఆటగాళ్లు సైతం మెగా వేలంలో పేర్లను రిజిస్టర్ చేసుకోవడం విశేషం. ప్రతి ఫ్రాంచైజీ తమ జట్టులో గరిష్ఠంగా 25 మంది ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. మొత్తం పది జట్లు కలిపి 250 మందిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఫ్రాంచైజీలు కొంతమందిని రిటెయిన్, సెలెక్ట్ చేసుకోవడంతో మెగా వేలం నుంచి 217 మందిని కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది.

రూ.2 కోట్ల బేస్ ప్రైజ్..

భారత ఆటగాళ్లలో రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్‌తో పాటు 20 మంది ఆటగాళ్లు రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో ఐపీఎల్ వేలంలో రిజిస్టర్ చేసుకున్నారు. రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, ఇషాన్ కిషన్, భువనేశ్వర్ కుమార్, దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, హర్షల్ పటేల్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, రాబిన్ ఊతప్ప, ఉమేశ్ యాదవ్‌లు రెండు కోట్ల బేజ్ ప్రైజ్ జాబితాలో ఉన్నారు.

కోటి రూపాయల జాబితాలో...

కోటి రూపాయల జాబితాలో...

ఓవర్ సీస్ ప్లేయర్లతో కలిపి రెండు కోట్ల జాబితాలో 31 మంది ప్లేయర్లు ఉండగా.. 1.5 కోట్ల లిస్ట్‌లో 20 మంది, కోటి జాబితాలో 31 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. పియూష్ చావ్లా, కేదర్ జాదవ్, ప్రసిధ్ కృష్ణ, టీ నటరాజన్, మనీశ్ పాండే, అజింక్యా రహానే, నితీశ్ రాణా, వృద్దిమాన్ సాహా, కుల్దీప్ యాదవ్, జయంత్ యాదవ్, మహమ్మద్ నబీ, జేమ్స్ ఫాల్కనర్ కోటి జాబితాలో ఉన్నారు.

Story first published: Saturday, January 22, 2022, 14:10 [IST]
Other articles published on Jan 22, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+