For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరో రికార్డు: సచిన్, హెడెన్, జో రూట్‌ల ఎలైట్ జాబితాలోకి విరాట్ కోహ్లీ

 Virat Kohli equals Sachin Tendulkars record of most 2000 plus runs in a calendar year

హైదరాబాద్: అభిమానులు ముద్దుగా ఛేజ్ మాస్టర్ అని పిలుచుకునే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. కోహ్లీ తాజాగా ఆటతీరుతో మరో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. మూడేళ్ల పాటు వరుసగా 2,000పై చిలుకు పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్స్‌ జాబితాలో విరాట్‌ కోహ్లీ చేరాడు.

గువహటి వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ 140 పరుగులు చేయడంతో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డుని సమం చేశాడు. వరుసగా మూడు కేలండర్‌ ఇయర్స్‌ (20016-18)లో 2000కు పైగా పరుగులు సాధించిన ఆటగాడిగానూ సచిన్‌ టెండూల్కర్, మాథ్యూ హెడెన్‌, జో రూట్‌ సరసన కోహ్లీ నిలిచాడు.

సచిన్ 1996-98 సంవత్సరాల మధ్య

సచిన్ 1996-98 సంవత్సరాల మధ్య

సచిన్ 1996-98 సంవత్సరాల మధ్య 2,000లకు పైగా పరుగులు సాధించాడు. మాథ్యూ హేడెన్‌ కూడా 2002-2004 సంవత్సరాల మధ్య ఏడాదికి రెండువేలకు పైగా పరుగులు సాధించాడు. జో రూట్‌ సైతం 2015-17 సంవత్సరాల మధ్య ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ సైతం 2015-18 సంవత్సరాల మధ్య ఏడాదికి రెండువేలకు పైగా పరుగులు చేశాడు.

ఇప్పటి వరకు 2083 పరుగులు చేసిన విరాట్‌ కోహ్లీ

ఇప్పటి వరకు 2083 పరుగులు చేసిన విరాట్‌ కోహ్లీ

ఈ ఏడాది ఇప్పటి వరకు విరాట్‌ కోహ్లీ 2083 పరుగులు సాధించాడు. శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర అత్యధికంగా ఆరుసార్లు ఒక కేలండర్ ఇయర్‌లో 2000కి పైగా పరుగులు సాధించాడు. దీంతో పాటు అత్యంత వేగంగా 60 అంతర్జాతీయ సెంచరీలు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

సచిన్ రికార్డుని బద్దలు కొట్టిన కోహ్లీ

ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ రికార్డుని సైతం కోహ్లీ బద్దలు కొట్టాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ఆదివారం గువహటి వేదికగా విండిస్‌తో జరిగిన తొలి వన్డేలో ఇన్నింగ్స్ 27వ ఓవర్‌లో బౌండరీతో కోహ్లీ తన 36వ సెంచరీని సాధించాడు. ఈ ఏడాది కోహ్లీకి ఇది నాలుగో వన్డే సెంచరీ కావడం విశేషం.

సచిన్‌కన్నా 40 ఇన్నింగ్స్‌లు తక్కువ ఆడి

సచిన్‌కన్నా 40 ఇన్నింగ్స్‌లు తక్కువ ఆడి

386 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. సచిన్‌కన్నా 40 ఇన్నింగ్స్‌లు తక్కువ ఆడి ఈ ఘనత సాధించాడు. వన్డేల్లో 36, టెస్టుల్లో 24 సెంచరీలతో ఉన్న ఈ విరాట్ కోహ్లీ మొత్తంగా 60 అంతకన్నా ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాళ్లలో ఐదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సచిన్‌ టెండూల్కర్ (100), రికీ పాంటింగ్‌ (71), కుమార సంగక్కర (63), జాక్వస్ కలిస్‌ (62) ముందున్నారు.

ఛేదనలో కోహ్లీకి 22వ సెంచరీ

గువహటి వన్డేలో కోహ్లీ సాధించిన సెంచరీ ఛేదనలో అతడికిది 22వ సెంచరీ కాగా స్వదేశంలో 15వది. ఇక, కెప్టెన్‌గా కోహ్లీ సాధించిన సెంచరీల సంఖ్య 14. 50 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్‌ (22) తర్వాతి స్థానంలో కోహ్లీ ఉన్నాడు. పాంటింగ్ 220 ఇన్నింగ్స్‌ల్లో ఈ సెంచరీలు చేశాడు.

Story first published: Monday, October 22, 2018, 17:03 [IST]
Other articles published on Oct 22, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+