Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే భారత్ X శ్రీలంక వామప్ మ్యాచ్‌‌కు శుభ్‌మన్ గిల్ దూరం: బీసీసీఐ

శ్రీలంక పర్యటన ప్రారంభానికి ముందే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయంతో వామప్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)2027లో భాగంగా రెండు టెస్ట్‌ల సిరీస్‌ కోసం టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.

రెండు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు శ్రీలంక ఎలెవన్‌తో టీమిండియా మూడు రోజుల వామప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌ నేటి(శుక్రవారం) నుంచి ఆదివారం వరకు జరగనుంది. కొలంబోలోని ఎన్‌సీసీ మైదానంలో మొదలైన ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఎలెవన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

BCCI Reveals Why Shubman Gill Is Not Playing India vs Sri Lanka Warm-Up Game Names New Captain

మరోవైపు ఈ వామప్ మ్యాచ్‌కు శుభ్‌మన్ గిల్ దూరంగా ఉంటాడని బీసీసీఐ ప్రకటించింది. అతని బొటన వేలికి గాయమైందని, ముందస్తు చర్యల్లో భాగంగా అతనికి ఈ వామప్ మ్యాచ్‌లోని తొలి రోజు ఆట నుంచి విశ్రాంతి కల్పించామని తెలిపింది. గాయం నుంచి కోలుకుంటే రెండో రోజు నుంచి వామప్ మ్యాచ్ ఆడుతాడని పేర్కొంది. ప్రస్తుతం అతన్ని బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తుందని తెలిపింది.

IND vs SL: మరికాసేపట్లో భారత్ X శ్రీలంక వామప్ మ్యాచ్.. ఎలా చూడాలంటే?

IND vs SL: మరికాసేపట్లో భారత్ X శ్రీలంక వామప్ మ్యాచ్.. ఎలా చూడాలంటే?

గురువారం ప్రాక్టీస్ సెషన్‌లో శుభ్‌మన్ గిల్ కుడిచేతి బొటన వేలికి గాయమైంది. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా బంతి అతని బొటనవేలికి గాయమైంది. ఫిజియోలో సాయంతో బ్యాటింగ్ ప్రాక్టీస్‌ను పక్కనపెట్టి ఫీల్డింగ్ డ్రిల్స్ చేసిన గిల్‌కు మళ్లీ బంతి అక్కడే తాకింది. శుభ్‌మన్ గిల్ గైర్హాజరీలో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ భారత జట్టును నడిపించనున్నాడు.

ఈ సన్నాహక మ్యాచ్‌లో భారత్ జట్టులోని 14 మంది ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. అయితే ఈ మ్యాచ్‌లోని పరుగులు, వికెట్లను అధికారిక గణంకాలుగా లెక్కించరు. ఆటగాడు ఎప్పుడైనా ఏ సమయంలోనైనా రిటైర్ కావచ్చు. ఎప్పుడైనా మరో బ్యాటర్ వచ్చి బ్యాటింగ్ చేయవచ్చు. బ్యాటర్ ఔటైన తర్వాత కూడా మళ్లీ వచ్చి బ్యాటింగ్ చేయవచ్చు. అయితే 10 వికెట్లు పడితే మాత్రం ఇన్నింగ్స్ ముగుస్తుంది.

జట్లు:

భారత్: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, సరాన్ష్ జైన్, అకిబ్ నబీ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్.

IND vs SL: టీమిండియాకు బిగ్ షాక్.. తొలి టెస్ట్‌కు ముందు స్టార్ ప్లేయర్‌కు గాయం!

Also Read

IND vs SL: టీమిండియాకు బిగ్ షాక్.. తొలి టెస్ట్‌కు ముందు స్టార్ ప్లేయర్‌కు గాయం!

శ్రీలంక ఎలెవన్: సోనాల్ దినుషా (కెప్టెన్), నిషాన్ మదుష్క, నిపున్ ధనంజయ, రవిందు రసంత, పవన్ రత్నాయకే, అహన్ విక్రమసింఘే, రమేష్ మెండిస్, దిలుమ్ సుదీర, విశ్వ ఫెర్నాండో, లహిరు కుమార, పసిందు సూర్యబండార, ఇసిత విజేసుందర, అన్హారవనక బందర, అన్హారవనక బండారు.

Story first published: Friday, August 7, 2026, 10:18 [IST]
Other articles published on Aug 7, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+