Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2025: 15 ఏళ్లుగా కొనసాగుతున్న సపోర్ట్ స్టాఫ్‌పై వేటు వేసిన గంభీర్!

ఆసియా కప్ 2025 టోర్నీకి ముందు భారత సపోర్ట్ స్టాఫ్‌పై వేటు పడింది. గత 15 ఏళ్లుగా జట్టుకు సేవలు అందిస్తున్న మసాజ్ థెరపిస్ట్ రాజీవ్ కుమార్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తప్పించింది. ఈ నిర్ణయం వెనుక గౌతం గంభీర్ ఉన్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ సారథ్యంలోనూ రాజీవ్ కుమార్ తన సేవలను జట్టుకు అందించాడు. అయితే ఈ నిర్ణయంపై బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

'రాజీవ్‌కుమార్‌ కాంట్రాక్ట్‌ను పొడగించకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టీమ్‌మేనేజ్‌మెంట్ రికమెండ్ చేసిన ఓ మసాజర్‌ను బోర్డు నియమించింది.'అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. జట్టుతో పాటు ఎక్కువ కాలం పాటు కొనసాగిన సహాయక సిబ్బందితో ఆశించిన ఫలితాలు రావని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు గంభీర్‌ తనకు నచ్చిన మసాజర్‌ను జట్టులోకి తీసుకురావడానికి రాజీవ్‌ను తప్పించాడనే వాదన వినిపిస్తోంది.

BCCI Removes Long-Serving Staff Member Ahead of Asia Cup 2025

రాజీవ్‌కుమార్‌కు జట్టుతో మంచి అనుబంధం ఉంది. పేసర్లకు చాలా మద్దతుగా నిలిచాడని చెబుతారు. ఆటగాళ్లతో స్నేహపూర్వకంగా ఉంటాడని.. గతంలో షమీ చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.గతంలో అరున్ కనడే అనే మసాజ్ థెరపిస్ట్‌ను కూడా బీసీసీఐ పక్కన పెట్టింది. ఇక ఫీల్డింగ్ కోచ్ దిలీప్‌ను కూడా వెళ్లిపోవాలని సూచించినా మళ్లీ యూటర్న్ తీసుకొని అతనికి మరోసారి అవకాశం కల్పించారు.

ప్రస్తుత భారత కోచింగ్, సపోర్ట్ స్టాఫ్

గౌతం గంభీర్(హెడ్ కోచ్), రియాన్ టెన్ డస్కటే(అసిస్టెంట్ కోచ్), సితాన్షు కోటక్(బ్యాటింగ్ కోచ్), మోర్నీ మోర్కెల్(బౌలింగ్ కోచ్), ఆడ్రియన్ లె రౌక్స్(స్ట్రెంగ్త్ అండ్ కండీషనింగ్ కోచ్), దిలీప్(ఫీల్డింగ్ కోచ్), రాఘవేంద్ర ద్వివేది(త్రో డౌన్ స్పెషలిస్ట్), ఉపాధ్యాయ(లాజిస్టిక్స్ మేనేజర్), హరి(వీడియో ఎనలిస్ట్)

Story first published: Saturday, August 23, 2025, 18:15 [IST]
Other articles published on Aug 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+