For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెలక్షన్​కమిటీ X టీమిండియా గొడవపై సౌరవ్ గంగూలీ ఏమన్నాడంటే..?

 BCCI President Sourav Ganguly says That’s Selectors’ Call Over Replacement For Injured Shubman Gill in England
IND VS ENG : Shubman Gill Replacements స్పందించిన Sourav Ganguly

కోల్‌కతా: యువ ఓపెనర్లు పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్ విషయంలో టీమిండియా మేనేజ్‌మెంట్, భారత సెలెక్షన్ కమిటీ మధ్య నెలకొన్న గొడవపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. ఈ యువ ఆటగాళ్లను పంపించే విషయమై నిర్ణయం సెలెక్టర్ల మీద ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశాడు. ఇక ఇంగ్లండ్ పర్యటనలో గాయపడ్డ శుభ్‌మన్ గిల్ స్థానంలో పృథ్వీ షా, పడిక్కల్‌లను ఇంగ్లండ్‌కు పంపించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మను విజ్ఞప్తి చేయగా ఆయన పట్టించుకోలేదని ప్రచారం సాగుతోంది. బీసీసీఐ, సెలక్షన్​ కమిటీ, టీమ్‌మేనేజ్‌మెంట్ మధ్య సఖ్యత లేదనే ప్రచారం జరుగుతుంది.

ఘనంగా బర్త్‌డే వేడుకలు..

ఘనంగా బర్త్‌డే వేడుకలు..

సౌరవ్ గంగూలీ గురువారం తన 49వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. కోల్‌కతాలోని తన కార్యాలయంలో సహోద్యోగులు ఏర్పాటు చేసిన సెలెబ్రేషన్స్‌లో చిరునవ్వులు చిందుస్తూ కేక్ కట్ చేశాడు. అనంతరం మీడియాతో సరదాగా మాట్లాడాడు. ఈ సందర్భంగా క్రికెట్‌, యూరో, కోపా అమెరికా ఫుట్‌బాల్‌, ఒలింపిక్స్‌కు సంబంధించి రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. కరోనా కారణంగా తన బర్త్‌డేను చాలా సింపుల్‌గా జరుపుకున్నట్లు దాదా తెలిపాడు. అనుకోకుండా ఏర్పాటు చేసిన కార్యక్రమమేన, ప్రీ ప్లాన్ కాదన్నాడు. ఈ క్రమంలో పృథ్వీషా, పడిక్కల్ వ్యవహారంపై దాదా ముందు ప్రస్తావించగా.. ఒక్క మాటతో ముగించేసాడు.

అందుకే యూఏఈకి..

అందుకే యూఏఈకి..

ఇక ముందుగా నిర్ణయించినట్లుగానే ఐపీఎల్ రెండో దశ​ యూఏఈలో సవ్యంగా జరుగుతుందని దాదా ఆశాభావం వ్యక్తం చేశాడు. అందరీ భద్రత దృష్టిలో ఉంచుకుని భారత్​ వేదికగా అక్టోబర్​-నవంబరులో జరగాల్సిన ఐసీసీ టీ20 ప్రపంచకప్​ యూఏఈకి తరలించినట్లు వెల్లడించారు.'అక్కడ నిర్వహించడం కాస్త బాధకరమైన విషయం. కానీ జీవితంలో ఇటువంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించం. గతేడాది కరోనా కారణంగా రద్దు అయిన ప్రపంచకప్​ ఈ ఏడాది కూడా అదే కారణంగా రద్దు అయింది. దీనివల్ల ఆటకు భారీ నష్టం కలిగింది. అందుకే సురక్షితమైన ప్రాంతంలో ఈ మెగాటోర్నీని నిర్వహించాలని నిర్ణయించాం" అని అన్నాడు.

అస్సలు కుదరదు

అస్సలు కుదరదు

భారత మహిళల జట్టు త్వరలోనే ఆస్ట్రేలియాతో పింక్ బాల్ టెస్ట్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్​కు ముందు ప్రాక్టీస్​ కోసం ఆగస్టులో దేశవాళీల్లో పింక్​ బాల్​ మ్యాచ్​లు​ నిర్వహించాలని బీసీసీఐ అపెక్స్​ కౌన్సిల్​ సభ్యురాలు శాంతా రంగస్వామి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన దాదా.. అది సాధ్యం కాదని స్పష్టం చేశాడు. ఆ సమయంలో వర్షాలు పడే అవకాశాలున్నాయన్నాడు. ఈ పర్యటన సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు ఉండగా.. పెర్త్​ వేదికగా ఈ పింక్ బాల్ మ్యాచ్​ జరగనుంది. 2006లో ఆసీస్​తో చివరిసారి భారత మహిళల జట్టు టెస్టు మ్యాచ్ ఆడింది. సెప్టెంబర్​లో జరిగేది రెండోది.

ఫిట్​గా ఉన్నా

ఫిట్​గా ఉన్నా

జనవరిలో దాదా గుండెపోటుతో ఆస్పత్రిలో చేరగా యాంజియోప్లాస్టీ చికిత్స ద్వారా కోలుకున్నాడు. ఈ నేపథ్యంలో తన ఆరోగ్యంపై ఓ రిపోర్టర్ ప్రశ్నించగా బాగున్నానని తెలిపాడు. 'నేను పూర్తి ఫిట్​గా ఉన్నాను. ఇది కొవిడ్​ సమయం. మీరు కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ల కోసం జాగ్రత్తగా ఉండండి.'అని సూచించాడు. 55 ఏళ్ల తర్వాత యూరోలో ఇంగ్లండ్ ఫైనల్‌కు వచ్చిందని, తనకు సంతోషంగా ఉందన్నాడు. ఇక కోపా అమెరికాలో బ్రెజిల్‌, అర్జెంటీనా మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. తన సపోర్ట్ ఎప్పుడూ బ్రెజిల్‌కే ఉంటుందని గంగూలీ తెలిపాడు. ఒలింపిక్స్‌కు వెళ్తున్న భారత అథ్లెట్లు ఈసారి చాలా మెడల్స్ తీసుకొచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.

Story first published: Thursday, July 8, 2021, 22:11 [IST]
Other articles published on Jul 8, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+