For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒకవైపు డబ్ల్యూటీసీ ఫైనల్‌, మరోవైపు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌.. మధ్యలో లంక పర్యటన! వెళ్లేది కోహ్లీసేన కాదు!

BCCI president Sourav Ganguly says Team India will play White Ball serieses against Sri Lanka in July
India To Play Against Sri Lanka With Squad Of White-Ball Specialists | Oneindia Telugu

ముంబై: ఈ ఏడాది చివరి వరకు టీమిండియా ఫుల్ బిజీగా ఉండనుంది. టెస్టు ఛాంపియన్‌షిప్‌, శ్రీలంక సిరీస్, ఇంగ్లండ్‌ సిరీస్‌, టీ20 ప్రపంచకప్.. కుదిరితే ఐపీఎల్ 2021 ఇలా వరుస పర్యటనలతో కోహ్లీసేన షెడ్యూల్ బిజీగా ఉంది. ముందుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌, ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ కోసం ఇంకో మూడు వారాల్లో లండన్ బయల్దేరబోతోంది భారత జట్టు. జూన్‌ 18-22 మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ ముగిశాక కోహ్లీసేన అక్కడే ఉండి కొన్ని వార్మప్‌ మ్యాచ్‌లు ఆడాక, ఆగస్టులో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌ ఆరంభించనున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడున్నర నెలల పాటు ఈ పర్యటన కొనసాగనుంది.

మధ్యలో శ్రీలంక టూర్

మధ్యలో శ్రీలంక టూర్

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు, జులైలో టీమిండియా టీ20, వన్డే సిరీస్‌ కోసం శ్రీలంకలో పర్యటించబోతుండటం విశేషం. ఇంగ్లండ్‌లో ఉన్న కోహ్లీసేన.. మధ్యలో శ్రీలంకలో ఎలా పర్యటిస్తుంది అనే సందేహం ఉండడం సహజం. అయితే లంకకు వెళ్లబోయేది వేరే భారత జట్టు. ఇంగ్లండ్ పర్యటనలో భాగమైన ఆటగాళ్లను మినహాయించి పరిమిత ఓవర్ల క్రికెట్‌ స్పెషలిస్టులతోనే మరో భారత జట్టును ఎంపిక చేసి శ్రీలంకకు పంపనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. గతేడాదే ఈ పర్యటన షెడ్యూల్ అయి ఉంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూనే ఉంది.

ధావన్‌, చహల్‌, భువీలతో టీమ్

ధావన్‌, చహల్‌, భువీలతో టీమ్

శ్రీలంక పర్యటనలో భారత్ 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక కాని శిఖర్‌ ధావన్‌, హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌, దీపక్‌ చహర్‌, యుజ్వేంద్ర చహల్‌, కుల్దీప్ యాదవ్ లాంటి సీనియర్లకు తోడు పృథ్వీ షా, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, రాహుల్‌ చహర్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, రాహుల్‌ తెవాతియా లాంటి కుర్రాళ్లను ఈ పర్యటనకు పంపే అవకాశముంది. మనీష్ పాండే, దినేష్ కార్తీక్ కూడా రేసులో ఉండొచ్చు. ఇక గాయం నుంచి కోలుకుంటే శ్రేయస్‌ అయ్యర్‌ కూడా లంకకు వెళ్తాడు. వీళ్లందరికీ టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఈ పర్యటన ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

మాడ్రిడ్‌ ఓపెన్‌ 'క్వీన్‌' సబలెంక.. టాప్‌ సీడ్ బార్టీకి షాక్!!

కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేసుకోండి

కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేసుకోండి

ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లే భారత క్రికెటర్లు.. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను మాత్రమే వేసుకోవాలని బీసీసీఐ సూచించినట్టు సమాచారం. ప్రస్తుతం ఐపీఎల్‌ 2021 వాయిదా పడడంతో క్రికెటర్లు తమ ఇళ్లకు వెళ్లారు. దీంతో ఎవరికి వారు వ్యక్తిగతంగా వ్యాక్సినేషన్‌ వేయించుకుంటున్నారు. అయితే ఇంగ్లండ్‌లో కొవాగ్జిన్‌ కంటే కొవిషీల్డ్‌ ఎక్కువగా దొరుకుతుంది. దీంతో తొలిడోసు తీసుకొన్న భారత ఆటగాళ్లు రెండో డోసును ఇంగ్లండ్‌లో వేయించుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని బోర్డు సూచించిందని తెలిసింది.

భారత జట్టు

భారత జట్టు

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), అజింక్య రహానే (వైస్‌ కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, మయాంక్‌ అగర్వాల్‌, ఛెతేశ్వర్‌ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్‌ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకుర్‌, ఉమేశ్‌ యాదవ్‌. కేఎల్ రాహుల్‌, వృద్ధిమాన్‌ సాహా.

స్టాండ్‌బై ఆటగాళ్లు: అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ధ్‌ కృష్ణ, అవేశ్‌ ఖాన్‌, అర్జున్‌ నాగ్‌వస్వల్లా.

Story first published: Monday, May 10, 2021, 8:18 [IST]
Other articles published on May 10, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+