Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sourav Ganguly: అనిల్ కుంబ్లే ఔట్.. ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా దాదా!

BCCI president Sourav Ganguly replaces Anil Kumble as chairman of ICC Cricket Committee
ICC కీలక నిర్ణయం.. ఇక నుంచి Anil Kumble స్థానంలో Sourav Ganguly || Oneindia Telugu

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) పురుషుల కమిటీ చైర్మన్‌గా భారత మాజీ కెప్టెన్, భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఐసీసీనే బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటి వరకు ఈ పదవి బాధ్యతలను నిర్వర్తించిన భారత దిగ్గజ క్రికెట్ అనిల్ కుంబ్లే నిబంధనలకు మేరకు తప్పుకున్నాడని, అతని స్థానాన్ని దాదా భర్తీ చేస్తాడని తెలిపింది.

'ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్​గా గంగూలీని నియమించడం ఆనందంగా ఉంది. బ్యాటర్​గా, క్రికెట్ పాలకుడిగా గంగూలీకి ఉన్న అనుభవం క్రికెట్​లో ఉత్తమ నిర్ణయాలు తీసుకునేలా దోహదపడాలని ఆశిస్తున్నాను. గత తొమ్మిదేళ్లుగా ఈ కమిటీ ఛైర్మన్​గా సేవలిందించిన అనిల్​ కుంబ్లేకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. డీఆర్​ఎస్​ అమలు సహా పలు కీలక నిర్ణయాల్లో కుంబ్లే పాత్ర కీలకం" అని ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్​క్లే ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం కీలక పదవుల్లో మూడు పర్యాయల కంటే ఎక్కువ కాలం కొనసాగరాదు. ఆ క్రమంలోనే మూడేళ్ల చొప్పున మూడు సార్లు ఐసీసీ కమిటీ చైర్మన్‌గా ఉన్న కుంబ్లే తప్పుకోవాల్సి వచ్చింది.

అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల పాలన నేపథ్యంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. అఫ్గాన్​ క్రికెట్ బోర్డు కార్యాచరణను సమీక్షించేందుకు ఓ వర్కింగ్ గ్రూప్​ను ఏర్పాటు చేసింది. ఇమ్రాన్ ఖ్వాజా(ఛైర్మన్), రాస్ మెక్​కలమ్, లాసన్ నైడో, రమీజ్ రాజాను గ్రూప్​ సభ్యులుగా నియమించింది. మరికొన్ని నెలల్లో ఈ గ్రూప్​.. నివేదికను సమర్పించనుంది. అఫ్గాన్​ పురుషుల, మహిళల జట్టును ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది.

మహిళల జట్లలోనూ ఫస్ట్​ క్లాస్, లిస్ట్​ ఏ విభాగాలుంటాయని ఐసీసీ తెలిపింది. ఐసీసీ ఉమెన్​ క్రికెట్​ కమిటీలో వెస్టిండీస్​ క్రికెట్ కమిటీ సీఈఓ జానీ గ్రేవ్​ను నియమించినట్లు పేర్కొంది.

Story first published: Wednesday, November 17, 2021, 14:51 [IST]
Other articles published on Nov 17, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+