Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

40 ఎకరాల్లో కొత్త ఎన్‌సీఏ.. ప్రారంభించిన బీసీసీఐ!

బెంగళూరులో కొత్తగా నిర్మించిన జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడు రోజర్ బిన్నీ ప్రారంభించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి బీసీసీఐ సెక్రటరీ జై షాతో పాటు ఉపాద్యక్షుడు రాజీవ్ శుక్లా హాజరయ్యారు. ఆధునాతన హంగులతో పాటు ప్రపంచస్థాయి సదుపాయాలతో ఈ స్టేడియాన్ని నిర్మించారు.

24 ఏళ్ల క్రితం 2000ల్లో ఎన్‌సీఏను బీసీసీఐ ప్రారంభించింది. అప్పటి నుంచి చిన్నస్వామి స్టేడియం ప్రాంగణంలోనే ఎన్‌సీఏ నడుస్తోంది. ఇది సరిపోకపోవడంతో బీసీసీఐ.. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న 40 ఎకరాల్లో కొత్త ఎన్‌సీఏను నిర్మించారు. ఇందులో మూడు ప్రపంచస్థాయి మైదానాలు, ఇండోర్, ఔట్‌డోర్ సహా మొత్తం 86 పిచ్‌లను ఏర్పాటు చేశారు.

BCCI President Roger Binny Inaugurate New NCA In Bengaluru

ఒలింపిక్ ప్రమాణాలతో స్విమ్మింగ్ పూల్, జిమ్, రీహాబిలిటేషన్ సెంటర్లను కూడా నిర్మించారు. నూతనంగా నిర్మించిన ఈ మైదానాలు ఇంగ్లండ్ కౌంటీ మైదానాలను తలపించేలా ఉన్నాయి. నూతన ఎన్‌సీఏలో నిర్మించిన మూడు మైదానాల్లో ప్రధానమైనది గ్రౌండ్ ఏ. ముంబై ఎర్ర మట్టి పిచ్‌లతో ఆధునాతన ప్రసార సౌకర్యాలతో తీర్చిదిద్దారు.

అలాగే గ్రౌండ్ బీ, సీ మైదానాలను ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసుకునేందుకు అణవుగా కట్టారు. ఇందులో 11 మాండయా మట్టి పిచ్‌లతో పాటు ఒడిశా నుంచి తెచ్చిన తొమ్మిది నల్ల కాటన్ మట్టి పిచ్‌లు ఉన్నాయి. అంతేకాకుండా ఆధునాతన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వర్షం పడినప్పుడు ఆటకి అంతరాయం కలగకుండా ఈ పిచ్‌లు త్వరగా సిద్దమవుతాయి.

వీటితో పాటు 45 ఔట్‌డోర్ నెట్ ప్రాక్టీస్ పిచ్‌లను కూడా ఏర్పాటు చేశారు. యూకే, ఆస్ట్రేలియా నుంచి ప్రీమియం టర్ఫ్‌లతో 8 పిచ్‌లను సిద్ధం చేశారు. ఇంటిగ్రెటెడ్ కెమెరాలు, సహజ కాంతి కోసం గాజు పలకలు, అతి పెద్ద జిమ్, 3 వేల స్క్వేర్ యార్డ్స్‌లో అతి పెద్ద డ్రెస్సింగ్ రూంలను నిర్మించారు.

Story first published: Sunday, September 29, 2024, 18:26 [IST]
Other articles published on Sep 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+