Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2027 ODI World Cup: టైటిల్ గెలవడమే లక్ష్యంగా బీసీసీఐ మాస్టర్ ప్లాన్!

ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027 గెలవడమే లక్ష్యంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) రోడ్ మ్యాప్ సిద్దం చేసింది. ఇప్పటికే సన్నాహాలు మొదలు పెట్టిన టీమిండియా.. మెగా టోర్నీకి ముందు మరిన్ని వన్డే మ్యాచ్‌లు ఆడేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు. ప్రపంచకప్ ముందు టీమిండియా తగినన్ని వన్డే మ్యాచ్‌లు ఆడేలా చూస్తామని తెలిపాడు.

గౌతమ్ గంభీర్‌పై ఫిర్యాదు!

గౌతమ్ గంభీర్‌పై ఫిర్యాదు!

'వచ్చే ఏడాది అక్టోబర్‌లో వన్డే ప్రపంచకప్ 2027 జరగనుంది. ఇప్పటికే ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ ఆడనుంది. జులై 14 నుంచి 19 వరకు ఈ సిరీస్ జరగనుంది. రాబోయే కాలంలో మరిన్ని మ్యాచ్‌లను టీమిండియా ఆడేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. మ్యాచ్ ప్రాక్టీస్ వల్ల కప్పు గెలిచేందుకు అవకాశాలు మెరుగవుతాయి. ఏది ఏమైనా టైటిల్ నెగ్గడమే టీమిండియా టార్గెట్.

BCCI Prepares 2027 ODI World Cup Roadmap Devajit Saikia Keeps Squad Strategies Confidential

అందుకోసం కట్టుదిట్టమైన ప్రణాళికలు రూపొందిస్తాం. రోడ్ మ్యాప్ తయారీలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ నుంచి సహాయక సిబ్బందిలోని ప్రతీ ఒక్కరిని భాగస్వాములను చేస్తాం. అంతర్జాతీయ స్థాయిలోనే అతి పెద్ద ఈవెంట్‌కు వెళ్లేటప్పుడు మంచి సన్నద్దత అవసరం. ఆ విషయంలో టీమిండియాకు కావాల్సివన్నీ చేసేందుకు బీసీసీఐ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది.'అని దేవజిత్ సైకియా చెప్పుకొచ్చాడు.

ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టును ఆదివారమే బీసీసీఐ ప్రకటించింది. విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణాలు రీఎంట్రీ ఇవ్వగా.. అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడిన యశస్వి జైస్వాల్, హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్‌లకు చోటు దక్కలేదు. యశస్వి జైస్వాల్ శతకంతో చెలరేగినా.. సెలెక్టర్లు పట్టించుకోలేదు.

గంభీర్ లాంటి షాడిస్ట్ కోచ్ కాదు.. ధోనీలాంటి మెంటార్ కావాలి: శ్రీశాంత్

గంభీర్ లాంటి షాడిస్ట్ కోచ్ కాదు.. ధోనీలాంటి మెంటార్ కావాలి: శ్రీశాంత్

భారత జట్టు చివరిసారిగా 2011 వన్డే ప్రపంచకప్ గెలుచుకుంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఓటమి ఎరగకుండా ఫైనల్ చేరినా.. తృటిలో టైటిల్ చేజారింది. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి బంగారం లాంటి అవకాశాన్ని వదులుకుంది. ఆ ఫైనల్ తర్వాత భారత వన్డే టీమ్‌లో చాలా మార్పులు జరిగాయి. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ బాధ్యతలు చేపట్టాడు.

Story first published: Monday, June 22, 2026, 14:17 [IST]
Other articles published on Jun 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+