Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: టీ20 ప్రపంచకప్‌కు ముందు బీసీసీఐ మాస్టర్ ప్లాన్!!

BCCI plans T20I Series against South Africa, New Zealand before the 2021 T20 World Cup

హైదరాబాద్: 2021 టీ20 ప్రపంచకప్‌ కోసం కౌంట్‌డౌన్ స్టార్ అయింది. అన్ని జట్లు తమ అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకునే పనిలోపడ్డాయి. భారత జట్టు కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ను కూడా ప్రపంచకప్‌ కోసం భారత్ ఉపయోగించుకుంటోంది. ఈ సిరీస్ ద్వారా బ్యాటింగ్, బౌలింగ్ ఆర్డర్‌లపై బీసీసీఐ దృష్టిసారించింది. అంతేకాకుండా మెగా టోర్నీ కోసం టీమిండియాకి మరింత ప్రాక్టీస్ కల్పించేందుకు.. బీసీసీఐ ఓ మాస్టర్ ప్లాన్‌ని కూడా సిద్ధం చేసినట్లు సమాచారం తెలుస్తోంది.

రెండు టీ20 సిరీస్‌లు

రెండు టీ20 సిరీస్‌లు

భారత గడ్డపై అక్టోబరు-నవంబరు నెలలలో టీ20 ప్రపంచకప్‌ జరగనున్న విషయం తెలిసిందే. టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత టీ20 వరల్డ్‌కప్ వరకూ కోహ్లీసేన మళ్లీ టీ20లు ఆడే అవకాశం దాదాపు లేదు. అలా అయితే మెగా టోర్నీలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌ ముంగిట న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో రెండు టీ20 సిరీస్‌లను బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. మెగా టోర్నీ ముందు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడితే.. టీమిండియాకి మంచి ప్రాక్టీస్ దొరకనుంది.

బీసీసీఐ చర్చలు

బీసీసీఐ చర్చలు

'మెగా టోర్నీ టీ20 ప్రపంచకప్‌ ముందు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు టీ20 సిరీస్‌ కోసం భారత్ గడ్డపైకి రానున్నాయి. ఇరు దేశాల క్రికెట్ బోర్డులతో బీసీసీఐ చర్చలు జరిపింది. బీసీసీఐ ప్రతిపాదనకు వారు సుముఖంగానే ఉన్నారు. త్వరలోనే అధికారికంగా అంగీకరించే అవకాశం ఉంది. అయితే షెడ్యూల్ ఇంకా అధికారికంగా ఫైనల్ కాలేదు. టీ20 ప్రపంచకప్‌ ముందు టీమిండియా పూర్తిగా టచ్‌లోకి రావాలనేది బీసీసీఐ ముఖ్య ఉద్దేశం' అని బీసీసీఐ అధికారి ఒకరు ఓ జాతీయ మీడియాతో అన్నారు.

నో చెప్పేందుకు సాహసించకపోవచ్చు

నో చెప్పేందుకు సాహసించకపోవచ్చు

నిజానికి దక్షిణాఫ్రికా జట్టు భారత్ గడ్డపై టీ20 సిరీస్‌ ఆడాలనే అగ్రిమెంట్.. గత ఏడాది నుంచి అలానే ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. ఈ టీ20 సిరీస్ వాయిదా పడింది. టీ20 ప్రపంచకప్‌ ముగిసిన వెంటనే భారత్ పర్యటనకి న్యూజిలాండ్ రాబోతోంది. అయితే ప్రపంచకప్‌ కంటే ముందే కివీస్‌ను రప్పించాలని బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోంది. దక్షిణాఫ్రికా గడ్డపైకి ఈ ఏడాది చివర్లో భారత్ జట్టు వెళ్లనుండటంతో.. బీసీసీఐ ప్రతిపాదనకి నో చెప్పేందుకు ప్రొటీస్ సాహసించకపోవచ్చు. కేవలం మనకే కాదు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లకు కూడా ఈ టీ20 లాభించనుంది.

India vs England: అదేమైనా బ్యాటింగ్‌ ఆర్డరేనా.. ‌టీమిండియా సెలెక్టర్లపై మండిపడ్డ మైకేల్‌ వాన్!!

Story first published: Thursday, March 18, 2021, 13:59 [IST]
Other articles published on Mar 18, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+