IPL 2027 కాస్త ముందుగానే.. మ్యాచ్‌ల పెంపు కష్టమే: బీసీసీఐ సెక్రటరీ
వచ్చే ఐపీఎల్ 2027 సీజన్‌ను కాస్త ముందుగానే నిర్వహించాలనుకుంటున్నామని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు. మే నెలలో విపరీతమైన ఎండల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మార్చి 10-మే 15 మధ్య నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని స్పష్టం చేశారు.
మ్యాచ్‌ల సంఖ్య పెంపు విషయంలో ఎలాంటి చర్చ జరగలేదన్నారు. అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా మ్యాచుల సంఖ్యను 94కు పెంచడం కష్టమని, వచ్చే ఏడాది కూడా 74 మ్యాచులే జరుగుతాయన్నారు.
తీవ్ర ఎండలతో..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సైకియా మాట్లాడుతూ.. ఈ వివరాలు వెల్లడించారు. 'ఈ ఏడాది ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి మే 31 వరకు జరిగింది. మే 15 తర్వాత టోర్నీ కీలక దశకు చేరుకుంది. పలు చోట్ల వర్షం పడటంతో పాటు ఎండల తీవ్రత కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించింది. ఇటు ఆటగాళ్లతో పాటు అటు అభిమానులు ఆటను ఆస్వాదించేందుకు ఇబ్బంది పడ్డారు.

ఈ క్రమంలోనే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌తో బీసీసీఐ చర్చలు జరుపుతోంది. లీగ్‌ను ఇంకాస్త ముందుగానే ప్రారంభిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నాం. వచ్చే సీజన్ కోసం మార్చి 10 నుంచి మే 15 విండోను ఖాళీగా ఉంచాం. ప్లే ఆఫ్స్ ఫైనల్‌కు వాతావరణం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలనేదే మా ఉద్దేశం. ఎండల తీవ్రత గురించి అభిమానుల నుంచి మాకు చాలా ఫిర్యాదులు అందాయి. ఆటగాళ్లు కూడా ఇబ్బంది పడ్డారు. వారందరికీ మంచి వాతావరణం అందించాల్సిన బాధ్యత మాపై ఉంది.
మ్యాచ్‌ల సంఖ్యను పెంచలేం..
మ్యాచ్‌ల సంఖ్యను పెంచే విషయంలో ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేం. చాలా అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. విదేశీ ఆటగాళ్లు కూడా బరిలోకి దిగుతారు కాబట్టి రెండు నెలల పాటు షెడ్యూల్‌ను కేటాయించాల్సి ఉంటుంది. మ్యాచ్‌ల సంఖ్యను పెంచితే కొందరు పూర్తి స్థాయిలో ఉండటం కష్టమవుతుంది. ఇతర దేశాలకూ ద్వైపాక్షిక సిరీస్‌లు ఉంటాయి. ఇప్పటికైతే మ్యాచ్‌ల సంఖ్యపై ఎలాంటి చర్చ జరగలేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

