యూఏఈలో ఐపీఎల్ 2021 సెకండాఫ్.. సెప్టెంబర్‌లో రీస్టార్ట్.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే..?

న్యూఢిల్లీ: కరోనాతో అర్థాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 సీజన్‌ను మళ్లీ నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు ఈ నెల 29న జరిగే స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్(ఎస్‌జీఎం)లో ఈ విషయంపై చర్చించనుంది. ఐపీఎల్ -14లో మిగిలిన 31 మ్యాచ్‌లను యూఏఈ వేదికగా పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సెప్టెంబర్ విండోను పరిశీలిస్తున్నట్లు ఓ జాతీయ చానెల్ పేర్కొంది.
సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు 30 రోజుల్లో లీగ్ పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయని తెలిపింది. 29న జరిగే బీసీసీఐ ప్రత్యేక సమావేశంలో ఐపీఎల్ భవిష్యత్తు ప్రణాళిక ప్రకటించనున్నారని తెలిపింది.

ఇంగ్లండ్ సిరీస్‌లో మార్పులు..
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా జూన్ 2న యూకే పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. తొలుత న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనున్న కోహ్లీసేన.. ఆ తర్వాత ఆగష్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఇంగ్లండ్‌తో 5 టెస్ట్‌లు సిరీస్ ఆడనుంది. దీంతో సెప్టెంబర్ 15 నుంచి ఐపీఎల్ సెకండాఫ్ నిర్వహించుకోవచ్చని బీసీసీఐ భావిస్తున్నది.
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ 41 రోజుల పాటు జరుగనున్నది. 2వ టెస్టుకు 3వ టెస్టుకు మధ్యలో 9 రోజుల గ్యాప్ ఉన్నది. దీన్ని నాలుగు రోజులకు తగ్గించాలని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుతో బీసీసీఐ సంప్రదింపులు జరుపుతోంది. అలా చేయడం ద్వారా ఐదవ టెస్టు సెప్టెంబర్ 14 కంటే ముందే ముగించే అవకాశం ఉంటుంది. దీంతో ఐపీఎల్ ప్రారంభానికి మరో నాలుగు రోజులు అదనంగా సమయం దొరుకుతుంది.

30 రోజుల్లో 31 మ్యాచ్‌లు..
బీసీసీఐకి 30 రోజుల విండో సరిపోతుంది. కానీ మరో నాలుగు రోజులు అదనంగా లభించడం ద్వారా ఇంగ్లండ్, భారత క్రికెటర్లు యూఏఈ చేరుకోవడానికి సమయం దొరుకుతుంది. లేకపోతే వీరు ఉండే టీమ్‌ల మ్యాచ్‌ల షెడ్యూల్ మార్చాల్సి వస్తుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం బీసీసీఐ అనుకుంటున్న సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 విండో మధ్యలో నాలుగు వీకెండ్స్ ఉంటాయి. ఆ 8 రోజుల్లో 16 మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉంటుంది. కాబట్టి మిగిలిన 15 మ్యాచ్‌లతో పాటు ప్లేఆఫ్స్‌ను 22 రోజుల్లో సర్దుబాటు చేయాల్సి ఉంటుంది.

పాత షెడ్యూల్‌నే..
వాయిదా పడిన షెడ్యూల్‌నే యూఏఈ వేదికగా సెప్టెంబర్ 15 నుంచి కొనసాగించే వీలుంది. గత ఏడాది యూఏఈ వేదికగా ఐపీఎల్ నిర్వహించిన అనుభవం ఉంది కాబట్టి హోటల్ బుకింగ్స్, లాజిస్టిక్స్ పెద్దగా సమస్య కాబోవని బీసీసీఐ భావిస్తున్నది. ఈ విండోలో ఐపీఎల్ నిర్వహిస్తే ఐసీసీ కూడా బీసీసీఐకి అడ్డు చెప్పదు.
యూఏఈ వేదికగా ఈ లీగ్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తే టీ20 ప్రపంచకప్‌ను కూడా అక్కడే నిర్వహించే అవకాశాలుంటాయి. ఈ ఏడాది భారత్ వేదికగానే జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ గురించి కూడా బీసీసీఐ స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్‌లో చర్చించనుంది. అవసరం అయితే చివరి నిమిషంలో టోర్నీని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు షిఫ్ట్ చెయ్యడాన్ని సెకండ్ ఆప్షన్‌గా కొనసాగించనుంది. అయితే, దేశంలో కరోనా పరిస్థితిని బట్టి జులై తర్వాతే తరలింపుపై నిర్ణయం తీసుకోనుంది.

యూకేలోనూ ఐపీఎల్..
ఇక ఐపీఎల్ 2021 సెకండాఫ్ నిర్వహణకు యూకేను కూడా బీసీసీఐ పరిశీలిస్తుంది. ఎందుకంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ టీమిండియా అక్కడే ఉండనుంది. అలాగే, ఇతర దేశాల ప్లేయర్లను యూకే తీసుకురావడం కూడా సులభం కానుంది. బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్ కూడా సానుకూలంగా ఉంది. అయితే, ఖర్చు ఎక్కువ కావడం ఒక్కటే యూకే విషయంలో ప్రతికూలతగా ఉంది.
కానీ, అక్కడి గవర్నమెంట్ స్పోర్ట్స్ ఈవెంట్ల కోసం ఫ్యాన్స్‌ను అనుమతిస్తోంది. ఫ్రాంచైజీలకు గేట్ రెవెన్యూ (టిక్కెట్ల డబ్బు) వస్తుంది కాబట్టి ఖర్చులను మేనేజ్ చేసుకోవచ్చని ఐపీఎల్ వర్గాలు చెబుతున్నాయి. ఖర్చులు తగ్గించుకోవాలంటే మాత్రం యూఏఈ సెకండ్ ఆప్షన్‌గా ఉంటుందని, అలాగే, శ్రీలంకలో ఐపీఎల్ నిర్వహించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని బోర్డు వర్గాలు అంటున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications