Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌లో ఆడేందుకు వాళ్లకు నో క్వారంటైన్: బీసీసీఐ

BCCI permits Bubble to Bubble transfers ahead of IPL 2021

న్యూఢిల్లీ: భారత్, ఇంగ్లండ్ సిరీస్‌లో ఆడుతున్న ప్లేయర్లకు ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్ అవసరం లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసింది. ప్లేయర్లు ఒక బబుల్ నుంచి మరో బబుల్‌లోకి డైరెక్ట్‌గా వెళ్లిపోవచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసిజర్(ఎస్‌వోపీ)ను క్రికెట్ బోర్డు విడుదల చేసింది.

అలాగే ఐపీఎల్‌తో సంబంధం ఉన్న వ్యక్తులకు వ్యాక్సిన్ వేయడం ఇప్పుడు సాధ్యం కాదని వెల్లడించింది. ఐపీఎల్‌లో పాల్గొనే భారత క్రికెటర్లకు వ్యాక్సిన్ వేయించాలని ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన విజ్ఞప్తి మేరకు బోర్డు ఈ విధంగా స్పందించింది.

'సిరీస్ ముగిసిన వెంటనే క్రికెటర్లను చార్టెడ్ ఫ్లైట్స్‌లో ఆయా ఫ్రాంచైజీలు తీసుకెళ్లొచ్చు. టీమ్ హోటల్ నుంచి నేరుగా వాళ్ల బబుల్‌లోకి ఎంట్రీ కావొచ్చు. ఇందుకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. తప్పనిసరి క్వారంటైన్ కూడా అవసరం లేదు. ఇక వ్యాక్సిన్ విషయంలో గవర్నమెంట్ ఓ ప్రోసిజర్ ప్రకారం వెళ్తోంది.

కాబట్టి వ్యక్తిగతంగా ప్లేయర్లెవరికీ వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం లేదు.'అని బీసీసీఐ పేర్కొంది. మరోవైపు మంగళవారం నుంచి తాము ఐపీఎల్-2021 సీజన్‌కు సంబంధించిన ప్రిపరేషన్స్‌ను మొదలుపెడతామని ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించింది. ఏడు రోజుల క్వారంటైన్ తర్వాత ట్రెయినింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పింది.

Story first published: Sunday, March 21, 2021, 16:17 [IST]
Other articles published on Mar 21, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+