
దాదాను అవమానించడమే..
'సాబా కరీమ్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తూ ఆయన సౌరవ్ గంగూలీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. ఆటగాళ్ల ఎంపిక, ఫిట్‌నెస్ అంశాల్లో కచ్చితంగా నిబంధనలు పాటించడంపై దాదా సీరియస్‌గా ఉంటారు. ఇవి తీవ్రమైన ఆరోపణలు. ఆటగాడిగా శుభ్‌మన్ గిల్, నాయకుడిగా దాదా నిజాయతీని అనుమానించడమే అవుతుంది. ఇది కరీమ్ ఏడుపే అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే కొంతకాలం క్రితం వరకూ ఆయన బీసీసీఐలో పనిచేశారు. ఒక ఆటగాడి ఫిట్‌నెస్‌ను ఎలా పరీక్షిస్తారో, ఆ ప్రక్రియ ఏంటో ఆయనకు బాగా తెలుసు.

సాబా కరీమ్ ఉన్నప్పుడు..
ఈ రోజుల్లో ఆటగాళ్లు గాయాలను దాచే అవకాశమే లేదు. బహుశా అతడు క్రికెటర్ లేదా సెలక్టర్‌గా ఉన్నప్పుడు అలా జరిగిందేమో నాకు తెలియదు. కానీ అతడి మాటలు మాత్రం బాధాకరం. ఇంగ్లండ్ పర్యటనకు ముందు శుభ్‌మన్‌కు ఎలాంటి గాయం కాలేదు. బహుశా న్యూజిలాండ్ మ్యాచ్ అయ్యాక కావొచ్చు. ఆ కుర్రాడు ఎంతో నిజాయతీ పరుడు. టీమ్‌ఇండియా తరఫున టెస్టు, ఇతర ఫార్మాట్లలో ఆడిన సాబా కరీమ్ ఇలా మాట్లాడటం మాత్రం దురదృష్టకరం.'అని సదరు అధికారి పేర్కొన్నారు.

ఆశ్చర్యంగా ఉంది..
శుభ్‌మన్‌గిల్ గాయాన్ని దాచడం ఆశ్చర్యపరిచిందని సాబాకరీమ్ మీడియాతో అన్నారు. అతడు సుదీర్ఘ కాలంగా టీమిండియాతో ప్రయాణిస్తున్నా ఫిజియోలు, వైద్య సిబ్బంది అతడి గాయాన్ని గుర్తించలేకపోయారని విమర్శించారు. ఈ విషయం ముందే ఎందుకు తెలియలేదో ఆశ్చర్య పరిచిందన్నారు.
'శుభ్‌మన్ గిల్ తన గాయాన్ని దాచిపెట్టడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. గిల్ చాలా కాలంగా భారత జట్టుతో కలిసి ప్రయాణిస్తున్నాడు. అక్కడ ఫిజియోలు, వైద్య సహాయకులు ఎప్పటికప్పుడు ఆటగాళ్ల ఫిట్‌నెస్ పరీక్షిస్తుంటారు. అసలా గాయం ఎప్పుడు జరిగింది. గిల్ ఎందుకు దాన్ని దాచిపెట్టాడనే విషయాలు ఆశ్చర్యంగా ఉన్నాయి' అని సబా కరీం అన్నారు.

సిరీస్ మొత్తానికి దూరం
ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ భారత్ ఆడనుంది. అయితే ఈ సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సేవలను కోల్పోయింది. అతను ఎడమ పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడని, 6 నుంచి 8 వారాల విశ్రాంతి అవసమరని జట్టు మేనేజ్‌మెంట్ తెలిపింది. దాంతో అతను ఇంగ్లండ్‌తో సిరీస్ మొత్తానికి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో యువ ఓపెనర్ పృథ్వీ షాకు బీసీసీఐ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. శ్రీలంక పర్యటనలో ఉన్న అతడిని ఇంగ్లండ్‌కు పంపించాలని బీసీసీఐ భావిస్తోందట.


Click it and Unblock the Notifications












