టీ20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దూరం.. వన్డే ప్రపంచకప్ కోసం బీసీసీఐ కీలక నిర్ణయం!

న్యూఢిల్లీ: ఐసీసీ టోర్నీల్లో టీమిండియా వరుసగా విఫలమవుతుండటాన్ని సీరియస్‌గా తీసుకున్న బీసీసీఐ.. ప్రక్షాళనకు నడుం బిగించింది. ముందుగా సెలెక్షన్ కమిటీపై వేటు వేసిన బీసీసీఐ.. జట్టుపై ఫోకస్ పెట్టింది. వచ్చే ఏడాది భారత్ వేదికగానే వన్డే ప్రపంచకప్ జరగనుండటంతో పకడ్బందీ ప్రణాళికలు రచించేందుకు సిద్దమైంది.

ఈ వన్డే ప్రపంచకప్‌‌ను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని బీసీసీఐ భావిస్తోంది. ఈ క్రమంలోనే టీ20 ఫార్మాట్‌కు సీనియర్ ఆటగాళ్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని దూరంగా పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఓవైపు సీనియర్ ఆటగాళ్లతో వన్డే ప్రపంచకప్‌కు ప్రిపరేషన్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్న బీసీసీఐ.. మరోవైపు టీ20 ప్రపంచకప్ 2024కు కుర్రాళ్లతో కూడి జట్టును రెడీ చేయాలనుకుంటుంది.

టీ20లకు సీనియర్లు దూరం..

టీ20లకు సీనియర్లు దూరం..

సీనియర్ల భవిష్యత్‌పై హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మౌనంగా ఉన్నప్పటికీ.. టీ20ల నుంచి సీనియర్లను తప్పించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. టీ20ల్లో జట్టు పగ్గాలను హార్దిక్ పాండ్యకు అప్పగిస్తారని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ పీటీఐ వెల్లడించింది. జట్టులోని సీనియర్లు టెస్టులు, వన్డేలపై ఫోకస్ చేయనున్నారు. సీనియర్ ఆటగాళ్లను రిటైర్ కావాలని కోరనప్పటికీ.. నెమ్మదిగా.. దశల వారీగా టీ20ల నుంచి పక్కనబెట్టి.. ఫ్రెష్ టీమ్‌ను 2024 టీ0 వరల్డ్ కప్‌కి సిద్దం చేయాలనదే బీసీసీఐ ప్లాన్ అని ఓ అధికారి తెలిపారు.

రిటైర్ కావాలని ఎవరి చెప్పం..

రిటైర్ కావాలని ఎవరి చెప్పం..

'రిటైర్ కావాలని బీసీసీఐ ఎవరికీ చెప్పబోదు. అది వ్యక్తిగత నిర్ణయం. 2023లో పెద్దగా టీ20 సిరీస్‌లు ఏవీ లేవు. సీనియర్లు చాలా మంది వన్డేలు, టెస్టు మ్యాచ్‌లపై ఫోకస్ పెడతారు'అని పేరు చెప్పడానికి ఇష్టపడని బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు.'రిటైర్ కావొద్దనుకుంటే.. రిటైర్మెంట్ ప్రకటించాల్సిన అవసరం లేదు. వచ్చే ఏడాది చాలా మంది సీనియర్ క్రికెటర్లు టీ20లు ఆడబోరు' అని సదరు అధికారి తెలిపారు.

కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా..

కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా..

2023లో వన్డే వరల్డ్ కప్ ఉండటంతో.. ఫోకస్ మొత్తం 50వ ఓవర్ల ఫార్మాట్‌పై ఉండనుంది. ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న భారత్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. టీ20ల్లో లాగే ఇప్పటికీ వన్డేల్లోనూ టీమిండియాకు కచ్చితమైన ప్లేయింగ్ ఎలెవన్ లేకపోవడం సమస్యగా మారే అవకాశం ఉంది. 30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లను టీ20ల నుంచి తప్పిస్తారని గతంలోనూ ప్రచారం జరిగింది.

అదే జరిగితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతోపాటు సూర్యకుమార్ యాదవ్ సైతం టీ20లకు దూరం కావాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్‌తో సిరీస్ ముగిసిన తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి రోహిత్ వైదొలిగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ పర్యటనకు ముందు బీసీసీఐ ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్‌కు కోహ్లీతో పాటు రోహిత్, ద్రవిడ్ హాజరుకానున్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, November 29, 2022, 16:12 [IST]
Other articles published on Nov 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X