Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గౌతమ్ గంభీర్‌పై వేటు!

ఇటీవల టీమిండియా వరుస పరాజయాలతో సతమతవుతుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా టెస్ట్‌ క్రికెట్‌లో టీమిండియా ఘోర పరాజయాలను ఎదుర్కొంటుంది. సొంతగడ్డపై అనూహ్యంగా న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌‌లో వైట్ వాష్ అయిన భారత్.. ఆస్ట్రేలియా పర్యటనలోనూ అదే తడబాటు కొనసాగిస్తోంది.

పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారీ విజయం సాధించిన భారత్.. ఆ తర్వా త అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో చిత్తయ్యింది. మూడో టెస్ట్‌ను వర్షం సాయంతో గట్టెక్కింది. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో 184 పరుగులు భారీ తేడాతో ఓటమిపాలైంది.

BCCI official Says Gautam Gambhir was not first choice coach his position not safe

ముఖ్యంగా బ్యాటింగ్ వైఫల్యం టీమిండియా ఓటములకు కారణమవుతోంది. బౌలింగ్‌లోనూ బుమ్రాకు సరైన సహకారం లభించడం లేదు. ఈ క్రమంలోనే సీనియర్ ఆటగాళ్ల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి బీసీసీఐ సిద్దమవుతున్నట్లు సమాచారం. భారత జట్టు ప్రదర్శనలో మార్పు కనిపించకపోతే కోచింగ్ స్టాఫ్, సెలెక్షన్ కమిటీపై కూడా వేటు వేసేందుకు బీసీసీఐ వెనకాడబోదని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.

'టీమిండియా.. ఆస్ట్రేలియాతో మరో టెస్ట్ మ్యాచ్ ఆడాలి. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. జట్టు ప్రదర్శన మెరుగవ్వకపోతే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌‌పై కూడా వేటు పడనుంది. టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎప్పుడూ ఫస్ట్ ఛాయిస్ కాదు. వీవీఎస్ లక్ష్మణ్‌ను హెడ్ కోచ్‌గా నియమించాలనుకున్నాం. కానీ అతను అంగీకరించలేదు.

కొంతమంది ప్రముఖ విదేశీ మాజీ ఆటగాళ్లు మూడు ఫార్మాట్‌లకు టీమిండియాకు కోచ్‌గా ఉండటానికి ఇష్టపడలేదు. కాబట్టి.. గంభీర్ విషయంలో బీసీసీఐ రాజీ పడింది. ఇతర అంశాలు కూడా ఇందుకు కారణమయ్యాయి.'అని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

Story first published: Wednesday, January 1, 2025, 20:11 [IST]
Other articles published on Jan 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+