Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: రోహిత్ కెప్టెన్సీపై వేటు.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత వన్డే టీమ్ ఇదే!

ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత వన్డే, టీ20 జట్లను అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. 15 మంది, 16 మంది సభ్యులతో కూడిన వన్డే, టీ20 జట్ల వివరాలను అజిత్ అగార్కర్ శనివారం వెల్లడించారు. అందరూ ఊహించనట్లుగానే వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించారు. శుభ్‌మన్ గిల్‌కు వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన సెలెక్షన్ కమిటీ.. వైస్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేసింది. కెప్టెన్సీ బాధ్యతలు కోల్పోయినా విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ ఆటగాడిగా జట్టులో చోటు దక్కించుకున్నాడు.

BCCI Names Shubman Gill New ODI Captain for Australia Tour Rohit Sharma and Virat Kohli Return to Squad

వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్‌కు అవకాశం దక్కగా.. రిషభ్ పంత్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. గాయం కారణంగా హార్దిక్ పాండ్యా ఆస్ట్రేలియా పర్యటనకు దూరమయ్యాడు. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి వన్డేలతో పాటు టీ20ల్లోనూ చోటు దక్కింది. వన్డేల నుంచి జస్‌ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చి టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు. మహమ్మద్ సిరాజ్ వన్డే టీమ్‌లోకి రీఎంట్రీ ఇవ్వగా.. హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. యశస్వి జైస్వాల్‌కు రెండు జట్లలో చోటు దక్కలేదు. ఆసియా కప్ ఫైనల్ హీరో తిలక్ వర్మకు వన్డే టీమ్‌లో అవకాశం దక్కలేదు. కానీ టీ20ల్లో తన చోటును నిలబెట్టుకున్నాడు.

ఆసియా కప్ 2025 విజేతగా నిలిచిన భారత టీ20 జట్టులో ఒకే ఒక్క మార్పు చేశారు. హార్దిక్ పాండ్యా స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి బరిలోకి దిగగా.. వాషింగ్టన్ సుందర్‌ను 16వ ఆటగాడిగా ఎంచుకున్నారు. వన్డే కెప్టెన్‌ను మార్చినా.. టీ20 సారథిగా మాత్రం సూర్యకుమార్ యాదవ్‌నే కొనసాగించారు.

ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారత వన్డే జట్టు:

శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(కీపర్), ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ

ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారత టీ20 జట్టు:

సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, వరుణ్ చక్రవర్తీ, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్

Story first published: Saturday, October 4, 2025, 15:46 [IST]
Other articles published on Oct 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+