Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG మూడో వన్డే.. SRH ఆల్‌రౌండర్‌కు జాక్‌పాట్!

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ హర్ష్‌దూబేకు జాక్‌పాట్ తగిలింది. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డేకు ఈ యువ స్పిన్ ఆల్‌రౌండర్ ఎంపికయ్యాడు. కుడి కాలి కండరాల గాయంతో దూరమైన వాషింగ్టన్ సుందర్ స్థానంలో హర్ష్‌దూబేను బీసీసీఐ ఎంపిక చేసింది.

అఫ్గానిస్థానతో ఇటీవలే జరిగిన వన్డే సిరీస్‌తో హర్ష్‌దూబే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లో 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు. లోయరార్డర్‌లో బ్యాటింగ్ చేసే సామర్థ్యం కూడా ఉండటంతోనే అతన్ని సుందర్‌కు రిప్లేస్‌మెంట్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

BCCI Names Harsh Dubey as Washington Sundar s Replacement for Series-Decider 3rd ODI Against England

హర్ష్‌దూబే సెలెక్షన్‌పై బీసీసీఐ ఒక ప్రకటనను విడుదల చేసింది. 'కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్‌లో జరిగిన రెండో వన్డేలో వాషింగ్టన్ సుందర్ కుడి కాలి తొడ కండరానికి గాయమైంది. దాంతో అతను సిరీస్‌లోని ఆఖరి మ్యాచ్‌కు దూరమయ్యాడు. వాషింగ్టన్ సుందర్ తన గాయానికి స్కానింగ్ చేయించుకొని, తదుపరి చికిత్స తీసుకుంటాడు.'అని బీసీసీఐ తమ ప్రకటనలో పేర్కొంది.

IND vs ENG: అతను విరాట్ కోహ్లీ కంటే బాగా ఆడాడు: అశ్విన్

IND vs ENG: అతను విరాట్ కోహ్లీ కంటే బాగా ఆడాడు: అశ్విన్

గురువారం కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్‌లో జరిగిన రెండో వన్డేలో బ్యాటింగ్ చేస్తుండగా వాషింగ్టన్ సుందర్ కాలికి తీవ్ర గాయమైంది. ఈ గాయం కారణంగా భారత బౌలింగ్ సమయంలో వాషింగ్టన్ సుందర్ ఫీల్డింగ్ కూడా చేయలేకపోయాడు. ఈ సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో ఆఖరి మ్యాచ్ సిరీస్ డిసైడర్‌గా మారింది. హర్ష్ దూబే చేరికతో ఆఖరి వన్డేలో సుందర్ స్థానంలో అతన్నే ఆడించే అవకాశం ఉంది. దాంతో కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ బెంచ్‌కే పరిమితం కానున్నారు. బ్యాటింగ్ డెప్త్‌కు టీమిండియా మేనేజ్‌మెంట్ ప్రాధాన్యత ఇస్తోంది.

IND vs ENG: భారత తుది జట్టులో అతిపెద్ద సమస్య.. గంభీర్ చేసిన పొరపాటు ఇదే!

IND vs ENG: భారత తుది జట్టులో అతిపెద్ద సమస్య.. గంభీర్ చేసిన పొరపాటు ఇదే!


ఇంగ్లండ్‌తో మూడో వన్డే‌కు భారత జట్టు(అప్‌డేట్)

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబే.

Story first published: Saturday, July 18, 2026, 18:24 [IST]
Other articles published on Jul 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+