For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India T20 WC Squad: బుమ్రా రిప్లేస్‌మెంట్ ప్రకటించిన బీసీసీఐ.. హైదరాబాదీకి నిరాశే!

 BCCI name Jasprit Bumrah replacement in India T20 World Cup squad

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌కు చివరి నిమిషంలో దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో ఊహించినట్లుగానే మహమ్మద్ షమీని ఎంపికచేశారు. ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టులో మార్పులు చేర్పులు చేయడానికి అక్టోబర్ 15 తుది గడవుకాగా.. బీసీసీఐ ఒకరోజు ముందుగానే బుమ్రా రిప్లేస్‌మెంట్‌ను ప్రకటించింది. ఈ విషయాన్ని ఐసీసీ ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఇక ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన జస్‌ప్రీత్ బుమ్రా.. వెన్నుగాయంతో టీమ్‌కు దూరమైన విషయం తెలిసిందే. అతనికి బ్యాకప్‌గా మహమ్మద్ షమీని రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపిక చేసినా.. అతను కరోనా బారిన పడటంతో ఫిట్‌నెస్‌పై సందేహాలు నెలకొన్నాయి. ఇక ఎన్‌సీఏలో షమీకి రెండు ఫిట్‌నెస్ టెస్ట్‌లు నిర్వహించగా.. రెండూ క్లియర్ చేశాడు. దాంతో ఆస్ట్రేలియాకు పంపించిన బీసీసీఐ.. టీమ్‌మేనేజ్‌మెంట్ సూచనలతో తుది నిర్ణయం ప్రకటించింది.

దాంతో మహమ్మద్ సిరాజ్‌కు నిరాశే ఎదురైంది. షమీ ఫిట్‌నెస్‌పై సందేహాలు నెలకొన్ననేపథ్యంలో మహమ్మద్ సిరాజ్‌ను రెడీ చేసినప్పటికీ.. అతను స్టాండ్‌బై లిస్ట్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ఇటీవల ముగిసిన సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో సిరాజ్ అద్భుత ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అందుకున్నాడు. దాంతో బుమ్రా స్థానంలో అతనికే అవకాశం దక్కుతుందని అంతా భావించారు. కానీ షమీ పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో సిరాజ్‌కు మొండి చెయ్యే ఎదురైంది. వెన్ను గాయంతో దూరమైన రిజర్వ్ ప్లేయర్ దీపక్ చాహర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను తీసుకున్నారు.

గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత మహమ్మద్ షమీ ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ ఈ ఏడాది ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చి ఆ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 16 మ్యాచ్‌ల్లో 8 ఎకనామీతో 20 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ పిచ్‌లపై ఆడిన అనుభవంతో పాటు బౌలింగ్‌లో పేస్ ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశాలు కాగా... మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం కలవరపెట్టే అంశం. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగే వాపమ్‌ మ్యాచ్‌లే అతనికి సన్నాహక గేమ్స్ కానున్నాయి.

భారత ప్రపంచకప్ జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ షమీ

స్టాండ్‌బై ప్లేయర్స్: మహమ్మద్ సిరాజ్, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్

Story first published: Friday, October 14, 2022, 17:00 [IST]
Other articles published on Oct 14, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+