Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ నిర్వహణపై గందరగోళంలో బీసీసీఐ!

BCCI mulling to organise cash-rich IPL behind closed doors

ముంబై: కరోనా(కోవిడ్‌-19) ఎంత పని చేసింది. మనుషుల్ని మింగేయడంతో పాటు ఒక్కో రంగాన్ని ముంచేస్తోంది. ఈ ప్రాణంతక వైరస్ దెబ్బకు పర్యాటక, వర్తక, వాణిజ్య, ఆర్థిక రంగాలే కాదు... క్రీడల రంగం కూడా కునారిల్లుతోంది. ఇప్పుడు ఈ వైరస్‌ సెగ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)కు తగిలింది. ఇన్నేళ్లుగా ప్రతీ వేసవిని ధనాధన్‌ మెరుపులతో అలరించిన ఈ లీగ్‌ ఇప్పుడైతే అటు స్పాన్సర్లని, ఫ్రాంచైజీలనే కాదు... ఇటు పాలకమండలినీ దడదడలాడిస్తోంది. మొత్తం మీద ఆట సాగినా... మునుపటిలా జరగనే జరుగదు. కళ తప్పిన 'షో'గా ఇంకా చెప్పాలంటే గేట్లన్నీ మూసేసి గుట్టుగా... గప్‌చుప్‌గా నిర్వహించే పరిస్థితి తీసుకొచ్చింది.

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి

ఓవైపు కరోనా.. మరోవైపు బిజీ షెడ్యూల్‌తో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) పరిస్థితి ఇప్పుడు ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి' అన్నట్లు తయారైంది. ఇప్పటికిప్పుడు ఏ నిర్ణయం తీసుకోకపోయినా... ఇంతకుమించి బీసీసీఐ చేసేదేమీ లేదు కూడా!

ఇంటర్నేషనల్ క్రికెట్ క్యాలెండర్,విదేశీప్లేయర్ల అందుబాటు దృష్ట్యా వాయిదా ఆలోచన కూడా చేయలేదు. మెగా లీగ్‌తో ఏడాదికి దాదాపు 11 బిలియన్ డాలర్లు ఆదాయం సమకూరుతుంది. ఒక వేళ లీగ్ రద్దయితే, బోర్డు, ప్రాంఛైజీలు తీవ్రంగా నష్టపోవడంతో పాటు ఇండియా ఎకానమీ కూడా ప్రభావితం అవుతుంది. పైగా ఖాళీ స్టేడియాల్లోమ్యాచ్ నిర్వహిస్తే టికెట్ల ఆదాయం మాత్రమే కోల్పోవాల్సి ఉంటుంది. అదేమంత నష్టం కాబోదని, బ్రాడ్ కాస్టింగ్స్ రైట్స్ రూపంలో సమకూరే ఆదాయంలో మార్పు ఉండబోదని బోర్డు పెద్దలు, ఫ్రాంచైజీ ఓనర్లు భావిస్తున్నట్లు సమాచారం.

కరోనా కల్లోలం.. ఆటలు ఆగమాగం!!

విదేశాల్లో నిర్వహించలేరు..

విదేశాల్లో నిర్వహించలేరు..

శనివారం జరిగే ఐపీఎల్‌ పాలకమండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ పెద్దలు ప్రకటించినప్పటికీ... బిజీ షెడ్యూలు వల్ల అటు వాయిదా వేయలేరు. ఇటు వేరే దేశంలో నిర్వహించనూ లేరు. ఎన్నికల సందర్భంగా 2009, 2014లలో విదేశాల్లో నిర్వహించింది. కానీ ఇప్పుడున్న ‘కరోనా మహమ్మారి' దృష్ట్యా ఏ దేశం నిర్వహణకు సిద్ధంగా లేదు. కాబట్టి ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. ప్రేక్షకుల్లేకుండానే ఈ సీజన్‌ నిర్వహించాల్సిందే. ఇలా నిర్వహిస్తే ఫ్రాంఛైజీలకు కల్పించే నష్టపరిహారంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

ఏప్రిల్‌ 15 తర్వాతే..

ఏప్రిల్‌ 15 తర్వాతే..

ఐపీఎల్‌ 13వ సీజన్‌ ఈ నెల 29న ప్రారంభమవుతుంది. అయితే రెండు వారాలపాటు జరిగే మ్యాచ్‌లు పూర్తిగా భారత ఆటగాళ్లతోనే జరుగనున్నాయి. ఎందుకంటే కరోనా భయాందోళనల వల్ల విదేశీయులకు మంజూరు చేసే వీసాలపై ఆంక్షలు విధించారు. కరోనా లేదని సర్టిఫికేట్‌ జతచేస్తేనే వీసాలిచ్చే అంశాల్ని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. దీంతో ఏప్రిల్‌ 15 తర్వాతే విదేశీ ఆటగాళ్లు భారత్‌లో అడుగుపెట్టే అవకాశముంది.

Story first published: Friday, March 13, 2020, 11:03 [IST]
Other articles published on Mar 13, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+