For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023: అతన్ని ఆడిస్తే అయిపోవ్ అనేదానికి చెక్! ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రవేశపెట్టనున్న బీసీసీఐ!

BCCI mulling to introduce Impact Player concept in IPL 2023, will try in Syed Mushtaq Ali T20 Trophy

హైదరాబాద్: ఇటీవల ఆసియాకప్ 2022 టోర్నీలో శ్రీలంకతో జరిగిన చావో రేవో మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ(41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 72), సూర్యకుమార్ యాదవ్(29 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 34) మూడో వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యం అందించినా టీమిండియా భారీ స్కోర్ చేయలేకపోయింది.

ముఖ్యంగా మిడిలార్డర్ వైఫల్యం జట్టు ఓటమికి కారణమైంది. పంత్, హార్దిక్ పాండ్యా వైఫల్యంతో దినేశ్ కార్తీక్ లేని లోటు తెలిసొచ్చింది. దీపక్ హుడాతో బరిలోకి దిగిన టీమిండియా దినేశ్ కార్తీక్‌ను తీసుకోలేకపోయింది. దినేశ్ కార్తీక్ ఉంటే ఈ మ్యాచ్ గెలిచేవాళ్లమని అంతా అనుకున్నారు.

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్..

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్..

అయితే ఇలాంటి పరిస్థితుల్లో తుది జట్టులో లేని దినేశ్ కార్తీక్‌ను దీపక్ హుడాకు బదులు తీసుకునే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను ఐపీఎల్‌ 2023 సీజన్‌లో ప్రవేశ పెట్టేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే సీజన్‌లో ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను మనం చూడొచ్చు.

ఈ రూల్ ప్రకారం తుది జట్టులో లేని ఓ ఆటగాడిని మ్యాచ్ జరగుతుండగా 14 ఓవర్ల లోపు మరో ఆటగాడికి రిప్లేస్‌మెంట్‌గా ఆడించవచ్చు. ఉదహారణకు శ్రీలంకతో జరిగిన ఆసియాకప్ మ్యాచ్‌లో ఈ రూల్ ఉంటే దీపక్ హుడా బదులు దినేశ్ కార్తీక్‌ను బరిలోకి దించే వెసులు బాటు ఉండేది. బౌలింగ్ సమయంలో కూడా కావాల్సిన బౌలర్‌ను తీసుకోవచ్చు. అయితే రిప్లేస్ మెంట్‌గా జట్టును వీడిన ఆటగాడు మాత్రం మళ్లీ మైదానంలోకి బరిలోకి దిగే అవకాశం లేదు. కనీసం సబ్‌స్టిట్యూట్ ఫీల్డింగ్ చేసేందుకు కూడా అతను అనర్హుడు.

14 ఓవర్ల లోపు ఎప్పుడైనా..

14 ఓవర్ల లోపు ఎప్పుడైనా..

మ్యాచ్ జరుగుతుండగా.. ఫోర్త్ అంపైర్ లేదా.. ఫీల్డ్ అంపైర్‌కు సమాచారమిచ్చి ఇంపాక్ట్ ప్లేయర్‌ను బరిలోకి దింపాలి. ఫుట్‌బాల్, రగ్బీ, బాస్కెట్ బాల్ మ్యాచ్‌ల్లో ఇప్పటికే ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను అమలు చేస్తున్నారు. ఈ కొత్త రూల్ కారణంగా మ్యాచ్ మరింత రసవత్తరంగా ఉండనుంది. ముఖ్యంగా ఏ ఆటగాడైన తీవ్రంగా గాయపడి ఆడే లేని పరిస్థితులో ఉన్నప్పుడు ఆ జట్టుకు బాగా ఉపయోగపడనుంది.

ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఆటగాడు బ్యాటింగ్ చేయడంతో పాటు 4 ఓవర్ల పాటు బౌలింగ్ కూడా చేయవచ్చు. ముందుగా అక్టోబర్ 11 నుంచి జరగనున్న దేశవాళీ టీ20 లీగ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈ రూల్‌ను ప్రయోగించాలని బీసీసీఐ భావిస్తోంది. అక్కడ సక్సెస్ అయితే ఐపీఎల్‌లో కూడా ప్రవేశ పెట్టనున్నారు.

రాష్ట్ర అసోసియేషన్‌లకు సమాచారం..

రాష్ట్ర అసోసియేషన్‌లకు సమాచారం..

ఇప్పటికే ఈ రూల్‌కు సంబంధించిన ఓ నోటీసును బీసీసీఐ.. రాష్ట్ర అసోసియేషన్‌లకు పంపించింది. 'ఇంపాక్ట్ రూల్ ప్రధాన కాన్సెప్ట్.. జట్టులో ఓ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌కు బౌలింగ్, బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వడమే. ఇది గేమ్‌కు సరికొత్త వ్యూహాత్మక కోణాన్ని అందిస్తోంది. ఇప్పటికే ఫుట్‌బాల్, రగ్బీ, బాస్కెట్ బాల్, బేస్ బాల్‌లో ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ అమలులో ఉంది. 'అని ఆ నోటీసులో బీసీసీఐ పేర్కొంది.

Story first published: Saturday, September 17, 2022, 11:59 [IST]
Other articles published on Sep 17, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+