Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐసీసీ కంటే బీసీసీఐ పవర్‌ఫుల్: ఆస్ట్రేలియా క్రికెటర్లు(వీడియో)

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కంటే భారత్ క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పవర్ ఫుల్ అని ఆస్ట్రేలియా క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.

ఇప్పటికే ఇరు జట్ల మధ్య మూడు టెస్ట్‌లు జరగ్గా చెరొక విజయంతో 1-1తో సమంగా నిలిచాయి. గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్‌ వర్షం కారణంగా డ్రా అయ్యింది. నాలుగో టెస్ట్‌ మెల్ బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే మెల్ బోర్న్ చేరుకొని ముమ్మరంగా సాధన చేస్తున్నాయి.

BCCI Most Powerfull Than ICC Australian Cricketers Makes Controversial Statement Video Goes Viral

ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లతో ఏబీసీ స్పోర్ట్స్ ఛానెల్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ప్రోగ్రామ్‌కు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, నాథన్ లయన్, స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ, గ్లేన్ మ్యాక్స్‌వెల్‌‌లు హాజరయ్యారు.

వారిని బీసీసీఐ, ఐసీసీ, భారత క్రికెట్ గురించి ఒక్క పదంలో చెప్పాలని హోస్ట్ ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానాలు చెప్పారు. ముందుగా ప్యాట్ కమిన్స్.. బీసీసీఐతో పాటు ఐసీసీ, భారత క్రికెట్ చాలా పెద్దవి అని, బిగ్, బిగ్, బిగ్ అని బదులిచ్చాడు.

ట్రావిస్ హెడ్ మాత్రం.. బీసీసీఐ ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తుందన్నాడు. బీసీసీఐ తర్వాత ఐసీసీ ప్రపంచ క్రికెట్ నడిపిస్తుందని, భారత క్రికెట్ చాలా బలమైనదని అభిప్రాయపడ్డాడు. ఉస్మాన్ ఖవాజా బీసీసీఐ బలమైదని, ఐసీసీ నైపుణ్యం కలిగినదని బదులిచ్చాడు.

నాథన్ లయన్ మాత్రం బీసీసీఐ చాలా పెద్దదని, ఐసీసీ బాస్ అని, భారత క్రికెట్‌లో ఎక్కువ ఆసక్తి చూపిస్తారని తెలిపాడు. అలెక్స్ క్యారీ మాత్రం బీసీసీఐ మోస్ట్ పవర్ ఫుల్ అని, ఐసీసీ ట్రోఫీలకు మాత్రమే పరిమితమని, భారత క్రికెట్ కూడా చాలా పవర్ ఫుల్ అని అభిప్రాయపడ్డాడు. గ్లేన్ మ్యాక్స్‌వెల్ సైతం ఇదే సమాధానం ఇచ్చాడు. బీసీసీఐ పవర్ ఫుల్, ఐసీసీ బాస్, భారత క్రికెట్‌లో అభిమానం ఎక్కువ అని బదులిచ్చాడు.

ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ధనికమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బీసీసీఐ మాజీ సెక్రటరీ జైషానే ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Story first published: Monday, December 23, 2024, 11:40 [IST]
Other articles published on Dec 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+