For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాలో కరోనా కలకలం.. ఆ బుక్ లాంచ్‌ కార్యక్రమమే కారణమా? కోహ్లీ, శాస్త్రిపై బీసీసీఐ ఆగ్రహం!

BCCI may probe Virat Kohli team members attending Ravi Shastri book launch over covid hits Team India
BCCI May Probe Virat Kohli, Team Members Attending Ravi Shastri Book Launch || Oneindia Telugu

న్యూఢిల్లీ: టీమిండియాలో కరోనా కలకలానికి హెడ్ కోచ్ రవిశాస్త్రి 'స్టార్ గేజర్' పుస్తకావిష్కరణ కార్యక్రమమే కారణమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్ ప్రారంభానికి ముందు ఈ బుక్ లాంచింగ్ కార్యక్రమం జరగ్గా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రితో పాటు మరికొంతమంది టీమ్ సభ్యులు పాల్గొన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే రవిశాస్త్రి కరోనా వైరస్ బారిన పడగా అతనికి సన్నిహితంగా ఉన్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌లు సైతం పాజిటీవ్ తేలారు. సన్నిహితంగా ఉన్న ఫిజియో నితిన్ పటేల్‌తో పాటు దాంతో వీరిని ఐసోలేషన్‌కు తరలించారు.

దాంతో ఈ నలుగురు సెప్టెంబర్ 10(శుక్రవారం) నుంచి ప్రారంభమయ్యే చివరి టెస్ట్‌కు దూరమయ్యారు. ఆటగాళ్లందరికి నెగటీవ్ వచ్చినప్పటికీ బబుల్ నిబంధనలకు విరుద్దంగా బుక్ లాంచింగ్ ఫంక్షన్‌కు హాజరవ్వడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి వెళ్లడం, కరోనా వైరస్ బారిన పడటంపై సమగ్ర దర్యాప్తు జరపనుందని బోర్డుకు సంబంధించిన ఓ అధికారి మీడియాకు తెలిపారు.

ఈ కార్యక్రమానికి హాజరుకావడంపై కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు కోచ్ రవిశాస్త్రిలను వివరణ కోరనుందని చెప్పారు. టీమ్‌ మేనేజర్ గిరీష్ పాత్రపై కూడా దర్యాప్తు జరపనుంది. బయో బబుల్ నిబంధనలకు విరుద్దంగా బుక్ లాంచింగ్ ఎలా అనుమతించారని ప్రశ్నించనుంది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే బీసీసీఐ పెద్దల దగ్గరకు వెళ్లాయి. 'బుక్ లాంచింగ్ హాజరవ్వడం పట్ల బీసీసీఐ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి హాజరవ్వడంపై కెప్టెన్, కోచ్, మేనేజర్‌లను వివరణ కోరడంతో పాటు దర్యాప్తు జరపనున్నారు'అని బీసీసీఐకి చెందిన అధికారి టైమ్స్ ఇండియాతో అన్నారు.

రిషభ్ పంత్ కరోనా బారిన పడిన తర్వాత ఆటగాళ్లనుద్దేశించి బోర్డు సెక్రటరీ జైషా లెటర్ రాసాడు. అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. అయినా అతని హెచ్చిరికలను బేఖాతరు చేసిన ఆటగాళ్లు.. ప్రైవేట్ ఫంక్షన్‌కు హజరవ్వడం బీసీసీఐ పెద్దలకు ఆగ్రహాన్ని తెప్పించిందంట.

యా భై ఏళ్ల తర్వాత ఓవల్‌లో భారత్‌కు టెస్టు విజయం దక్కింది. ఆఖరి రోజు అద్భుతంగా బౌలింగ్‌ చేసిన టీమ్‌ ఇండియా నాలుగో టెస్టులో 157 పరుగుల తేడాతో ఆతిథ్యఇంగ్లండ్ను ఓడించింది. 368 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 77/0తో అయిదో రోజు, సోమవారం బరిలోకి దిగినఇంగ్లండ్.. 210 పరుగులకు ఆలౌటైంది. ఉమేశ్‌ యాదవ్‌ (3/60), శార్దూల్‌ ఠాకూర్‌ (2/22), బుమ్రా (2/27), జడేజా (2/50) ఆ జట్టు పతనాన్ని శాసించారు. ఓపెనర్లు హమీద్‌ (63), బర్న్స్‌ (50) తొలి వికెట్‌కు వంద పరుగులు జోడించినా.. ఆ తర్వాత వచ్చినఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ తేలిపోయారు. రోహిత్‌ శర్మకు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది.

Story first published: Tuesday, September 7, 2021, 12:58 [IST]
Other articles published on Sep 7, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+