అబుదాబిలో కఠిన నిబంధనలు.. రెండు దశలలో ఐపీఎల్ 2020?

హైదరాబాద్: యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ సెప్టెంబర్ 19న ప్రారంభం కానుంది. ఇక లీగ్ ప్రారంభం కావడానికి ఇంకా 20 రోజుల సమయమే ఉంది. ఐపీఎల్ టోర్నీ తేదీలు ఖరారు అయినా.. మ్యాచ్ షెడ్యూల్ మాత్రం ఇంకా విడుదల కాలేదు. అయితే అబుదాబిలో ఉన్న కఠినమైన కరోనా నిబంధనల వల్లే.. మ్యాచ్ షెడ్యూల్ ఆలస్యం అవుతున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు బీసీసీఐ తెగ ప్రయత్నాలు చేస్తోందట.

అబుదాబిలో కఠిన నిబంధనలు:
ఐపీఎల్ మ్యాచులు జరిగే దుబాయ్, షార్జాలతో పోలిస్తే.. అబుదాబిలో కరోనా నిబంధనలు మరింత కఠినంగా ఉన్నాయి. ఐదు రోజులకు ఒకసారి కరోనా పరీక్షలు చేయించుకోవాలని బీసీసీఐ నిబంధన పెట్టినా.. అబుదాబిలో మాత్రం ఆ నిబంధనలు మరింత కఠినంగా ఉన్నాయి. అబుదాబిలోకి వచ్చే ప్రతి ఒక్కరూ ఎంట్రీ పాయింట్ వద్ద కచ్చితంగా పరీక్ష చేయించుకోవాలి. 50 దిర్‌హమ్‌లు చెల్లిస్తే వెంటనే పరీక్ష చేస్తారు. ఆ రిపోర్ట్ 48 గంటల వరకు మాత్రమే పనిచేస్తుంది. మ్యాచ్ రోజున ఇటువంటి కఠినమైన విధానాలతో బీసీసీఐకి పెద్ద తలనొప్పే. ఐపీఎల్ 2020 షెడ్యూల్‌ను బీసీసీఐ ఇంకా ప్రకటించకపోవడానికి కారణం కూడా అదేనట.

సింగిల్ లెగ్‌లో దుబాయ్ మ్యాచ్‌లు:
అబుదాబిలోని ప్రోటోకాల్ నేపథ్యంలో దుబాయ్ మ్యాచ్‌లను సింగిల్ లెగ్‌లో పూర్తి చేయాలని బీసీసీఐ ప్రయత్నిస్తున్నది. స్థానిక ప్రోటోకాల్‌లను అధిగమించడానికి ఐపీఎల్ టోర్నీని రెండు భాగాలుగా (లెగ్) విభజించాలని.. యూఏఈలోని బీసీసీఐ బృందం ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరుపుతోందట. ప్రస్తుతం దుబాయ్ నుండి షార్జాకు వెళ్లడానికి ఎటువంటి పరిమితులు లేవు కాబట్టి ఐపీఎల్ మొదటి దశను దుబాయ్ మరియు షార్జాలో నిర్వహించాలని బీసీసీఐ చూస్తోందట. రెండవ దశలో దుబాయ్ నుండి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న అబుదాబిలో మ్యాచులు ఉంటాయి.

దుబాయ్‌లో 21, అబుదాబిలో 21:
ఈ రెండు దశలలో ఐపీఎల్ 2020 లీగ్ మ్యాచులను పూర్తిచేయాలని బీసీసీఐ చూస్తోంది. మొదటగా దుబాయ్, ఆ తర్వాత అబుదాబిలో మ్యాచులు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్లే-ఆఫ్స్, ఫైనల్స్ కోసం జట్లు మళ్లీ దుబాయ్‌కు తిరిగిరానున్నాయి. బీసీసీఐ ఈ వారంలో అధికారిక షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. దుబాయ్‌లో 21, అబుదాబిలో 21, షార్జాలో 14 లీగ్ మ్యాచులు జరగనున్నాయి.

ముగిసిన క్వారంటైన్:
ఐపీఎల్ టోర్నీ కోసం అందరికన్నా ముందుగా దుబాయ్‌కు చేరుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల ఆరు రోజుల క్వారంటైన్ బుధవారంతో ముగిసింది. చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ టీంల క్వారంటైన్ ఈరోజు ముగియనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు క్వారంటైన్.. శనివారంతో ముగియనుంది. అన్ని జట్ల క్వారంటైన్ ముగిసిన తర్వాత అసలు సిసలైన సందడి మొదలవ్వనుంది.
ఐదు రోజుల ఫిట్‌నెస్ క్యాంప్ కోసం.. ధోనీనే పట్టుబట్టాడు: సీఎస్‌కే సీఈఓ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications