ఐదు రోజుల ఫిట్‌నెస్ క్యాంప్ కోసం.. ధోనీనే పట్టుబట్టాడు: సీఎస్‌కే సీఈఓ

దుబాయ్: యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ ఎడిషన్ సెప్టెంబర్ 19న ప్రారంభం కానుంది. ఇక ఐపీఎల్ ప్రారంభం కావడానికి ఇంకా 20 రోజుల సమయమే ఉంది. ఇప్పటికే అన్ని ప్రాంఛైజీలు యూఏఈ చేరుకొని.. క్వారంటైన్ సమయంను పూర్తిచేసుకుంటున్నాయి. శనివారం లోగా అన్ని ప్రాంఛైజీల ఆరు రోజుల క్వారంటైన్ ముగియనుంది. గత శుక్రవారం ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) దుబాయ్ గడ్డపై అడుగుపెట్టింది. ఈరోజుతో సీఎస్‌కే క్వారంటైన్ ముగియనుంది. ఇక ప్రాక్టీస్ ప్రారంభించనుంది.

ఫిట్‌నెస్‌పై దృష్టి
గత మార్చిలో కరోనా వైరస్ లాక్‌డౌన్ విధించకముందు ఎలాగైతే రెండు వారాల ప్రత్యేక శిక్షణా శిబిరం నిర్వహించిందో.. అలాగే ఇప్పుడూ దుబాయ్‌కు వెళ్లేముందు మరోసారి ఐదు రోజుల ప్రత్యేక ఫిట్‌నెస్ క్యాంప్ ఏర్పాటు చేసింది. దీంతో అన్ని జట్ల కన్నా ముందే సీఎస్‌కే ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై దృష్టిసారించింది. ఈ నిర్ణయానికి కారణం కెప్టెన్ ఎంఎస్ ధోనీయే అని ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ తాజాగా వెల్లడించారు. తమ ఫిట్‌నెస్ క్యాంప్‌నకు సంబంధించి సీఎస్‌కే సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో పంచుకొంది. దానిలో పేసర్ దీపక్ చాహర్, బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు మాట్లాడారు.

క్యాంప్ అనుభవం పనికొస్తుంది
తొలుత దీపక్ చాహర్ మాట్లాడుతూ... 'కరోనా కారణంగా ప్రతీ ఆటగాడు 5 నెలల పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. ఇప్పుడంతా ఒక్కటే. రాబోయే ఐపీఎల్‌లో మేం కాస్త మెరుగ్గా ఉంటామని భావిస్తున్నా. ఎందుకంటే మాకు ఈ ఫిట్‌నెస్ క్యాంప్ అనుభవం పనికొస్తుంది' అని చెప్పాడు. అంబటి రాయుడు మాట్లాడుతూ... 'కరోనాతో 5 నెలలు ఆటకు దూరమయ్యాం. సరైన ప్రాక్టీస్ లేక ఇంట్లోనే ఖాళీగా ఉన్నాం. కాబట్టి ఈ శిబిరం ఆటగాళ్లందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆటగాళ్లు శారీరకంగా, మానసికంగా సిద్ధమవుతారు' అని పేర్కొన్నాడు.

ధోనీనే పట్టుబట్టాడు
కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ... 'ఐపీఎల్ జరుగుతుందని తెలిశాక నేను ఎంఎస్ ధోనీతో మాట్లాడా. అప్పుడతడు మళ్లీ ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయాలన్నాడు. అందు కోసం ప్రత్యేక అనుమతులు పొందాలి. బయో బబుల్ నిర్మించాలి. ఆ విషయంపై నేను సంశయించాను. ఇక దుబాయ్‌కు వెళ్లేముందు ఐదు రోజులు అవసరమా అని అడిగాను. ఆ విషయంలో ధోనీ చాలా సానుకూలంగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాడు. నాలుగైదు నెలలుగా ఆటగాళ్లెవరూ క్రికెట్ ఆడలేదని. దాంతో కచ్చితంగా ఇది అవసరమన్నాడు. చెన్నైలోనే బయో బబుల్ వాతావరణం సృష్టిస్తే అది దుబాయ్‌కు వెళ్లాక ఉపయోగపడుతుందని వివరించాడు' అని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
700 వికెట్లు కూడా తీయగలను: అండర్సన్