Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దేశవాళీ క్రికెట్‌లో నయా రూల్స్.. అలా చేస్తే మ్యాచ్ మొత్తం సస్పెండ్!

భారత దేశవాళీ క్రికెట్ సీజన్ 2026-27‌ ముందు ఆట నియమాల్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పలు మార్పులు చేసింది. ఇక నుంచి బౌలర్ ఉద్దేశపూర్వకంగా ఫ్రంట్‌ఫుట్ నోబాల్ వేస్తే మ్యాచ్‌ మొత్తానికి సస్పెండ్ చేస్తారు. ఇప్పటి వరకు ఈ సస్పెన్షన్ ఇన్నింగ్స్ వరకు మాత్రమే ఉండేది. క్రికెట్ చట్టాలను సంరక్షించే మెరీల్‌బోన్ క్రికెట్(ఎంసీసీ) ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ప్రతిపాదించిన మార్పులకు అనుగుణంగా బీసీసీఐ దేశవాళీ క్రికెట్‌లో మార్పులు చేసింది.

మ్యాచ్ మొత్తం సస్పెండ్.

ఉద్దేశపూర్వకంగా ఫ్రంట్-ఫుట్ నోబాల్, బంతి నేలను తాకకుండా విసిరేయడం వంటి వాటికి సంబంధించి ఆట నిబంధనల్లో ఆర్టికల్ 41.8‌ను బీసీసీఐ సవరించింది. అయితే ఆటగాడిని సస్పెండ్ చేసే విషయంలో ఫీల్డ్ అంపైర్‌దే తుది నిర్ణయమని పేర్కొంది.

BCCI Makes Changes To Playing Conditions Ahead of 2026-27 Indian Domestic Season

ఆఖరి ఓవర్‌లో వికెట్ పడ్డా..

ఇకపై ఆట చివరి ఓవర్ మధ్యలో వికెట్ పడ్డా.. ఆ ఓవర్ మొత్తం ఆడాల్సి ఉంటుంది. ప్రస్తుతం చివరి ఓవర్‌లో వికెట్ పడిన వెంటనే ఆ రోజు ఆటను ముగిస్తున్నారు. ఈ మేరకు బీసీసీఐ ఆర్టికల్ 12.5.2‌ను సవరించింది. పాత రూల్స్ ప్రకారం ఆఖరి ఓవర్‌లో కొత్త బ్యాటర్‌ను క్రీజులోకి పంపడానికి ఆలస్యమవ్వడం, ఆటకు అంతరాయం కలగడంతో వికెట్ పడగానే ఆ రోజు ఆటను ముగించేవారు.

వికెట్ కీపర్లకు ఉపశమనం..

బీసీసీఐ నయా రూల్స్‌తో వికెట్ కీపర్లకు కూడా కొంత ఉపశమనం లభించింది. నయా రూల్ 27.3 ప్రకారం.. వికెట్ కీపర్ గ్లౌవ్స్ కేవలం బంతిని విసిరే సమయంలో మాత్రమే వికెట్ల వెనుక ఉంటే సరిపోతుంది. గతంలో బౌలర్ తన రన్-అప్ ప్రారంభించిన సమయం నుంచే కీపర్లు తమ గ్లౌవ్స్‌ను వికెట్ల వెనుకే ఉంచాల్సి వచ్చేది. గతంలో కొన్ని సందర్భాల్లో ఈ నియమం కారణంగా బంతిని 'నో-బాల్'గా ప్రకటించడం, స్టంపింగ్‌ను రద్దు చేయడం జరిగేది.

డిక్లరేషన్ విషయంలోనూ..

డిక్లరేషన్‌ విషయంలోనూ బీసీసీఐ మార్పులు చేసింది. ఇక నుంచి చివరి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇది కృత్రిమ ఫలితాల కోసం ఉపయోగించబడుతుందని, ఆటకు హానికరమని క్రికెట్ పాలక మండళ్ళు భావించడమే దీనికి కారణంగా తెలుస్తోంది.

హెడ్ కోచ్‌కు అనుమతి..

దేశవాళీ వన్డే మ్యాచ్‌ల సందర్భంగా డ్రింక్స్ బ్రేక్‌లో హెడ్ కోచ్ మైదానంలోకి వెళ్లొచ్చు. అంతర్జాతీయ వన్డేల్లో కూడా ఐసీసీ కూడా అనుమతిస్తుండటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ ఈ మార్పుల గురించి ఇప్పటికే రాష్ట్ర అసోసియేషన్‌లకు సమాచారమిచ్చింది. వచ్చే నెలలో ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీలో ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

Story first published: Wednesday, July 22, 2026, 8:04 [IST]
Other articles published on Jul 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+