Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ, రోహిత్‌కు బీసీసీఐ బిగ్ షాక్.. సెంట్రల్ కాంట్రాక్టుల్లో డిమోషన్?

టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ‌లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి వార్షిక కాంట్రాక్టుల విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల్లో A+ కేటగిరిలో ఉన్న కోహ్లీ, రోహిత్ శర్మను బీ కేటగరికి డిమోట్ చేయాలనే యోచనలో బోర్డు ఉన్నట్లు సమాచారం.

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ సిస్టమ్‌ను పూర్తిగా మార్చేయాలని అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత పురుషుల సెలెక్షన్ కమిటీ బోర్డుకు సూచించినట్లు తెలుస్తోంది. ఏ ప్లస్ కేటగిరీని పూర్తిగా తొలగించి మూడు కేటగిరీలను ఉంచాలని సెలెక్షన్ కమిటీ ప్రతిపాదించినట్లు ఓ జాతీయ ఛానెల్ పేర్కొంది. అదే జరిగితే కోహ్లీ, రోహిత్ శర్మ‌లపై ఎక్కువ ప్రభావం పడనుంది.

టెస్ట్, టీ20 ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికిన కోహ్లీ, రోహిత్ శర్మలు A+ కేటగిరి నుంచి బీ కేటగిరికి పడిపోయే ఛాన్స్ ఉంది. అపెక్స్ కౌన్సిల్ తదుపరి సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ విషయంపై బీసీసీఐ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.

BCCI Likely to Scrap A Contracts Virat Kohli and Rohit Sharma Set for Demotion to Category B

ఆటగాళ్ల స్థాయి, వారు చేస్తున్న ప్రదర్శన, ఆడుతున్న ఫార్మాట్ల ఆధారంగా బీసీసీఐ ఏటా సెంట్రల్ కాంట్రాక్ట్‌లను ప్రకటిస్తుంది. గతేడాది కూడా కోహ్లీ, రోహిత్ శర్మలకు వార్షిక కాంట్రాక్టుల్లో డిమోషన్ లభించనుందని వార్తలు వచ్చాయి. కానీ బీసీసీఐ మాత్రం వారిని A+ కేటగిరిలోనే కొనసాగించింది. బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల్లో A+ ఆటగాళ్లకు రూ.7 కోట్లు, A కేటగిరి ప్లేయర్లకు రూ.5 కోట్లు, B కేటగిరికి రూ.3 కోట్లు, C కేటగిరికి రూ.1 కోటి వార్షిక వేతనాన్ని బీసీసీఐ చెల్లిస్తోంది. ఈ వేతనం మ్యాచ్‌ ఫీజులు, అలవెన్స్‌లకు అదనం. ఈ కేటగిరిల్లో ఉన్న ఆటగాళ్లకు మ్యాచ్‌లతో సంబంధం లేకుండా వార్షిక వేతనం లభిస్తుంది.

గతేడాది ఏప్రిల్‌లో 2024-25 సీజన్‌కు సంబంధించి బీసీసీఐ ప్రకటించిన వార్షిక కాంట్రాక్టుల్లో మొత్తం 34 మంది ఆటగాళ్లకు నాలుగు కేటగిరీల్లో చోటు దక్కింది. బీసీసీఐ రూల్స్‌ను అతిక్రమించి కాంట్రాక్టులు కోల్పోయిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ తిరిగి కాంట్రాక్టులు అందుకోగా.. తెలుగు తేజం నితీస్ కుమార్ రెడ్డికి తొలిసారి కాంట్రాక్ట్ దక్కింది.

బీసీసీఐ 2024-25 సెంట్రల్ కాంట్రాక్ట్స్:

1. గ్రేడ్ A+ (వార్షిక వేతనం: రూ.7 కోట్లు): రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.

2. గ్రేడ్ A (వార్షిక వేతనం: రూ.5 కోట్లు): రిషభ్ పంత్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా.

3. గ్రేడ్ B (వార్షిక వేతనం: రూ.3 కోట్లు): సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్.

4. గ్రేడ్ C (వార్షిక వేతనం: రూ.1 కోటి): రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివం దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కె.ఎస్. భరత్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా.

Story first published: Tuesday, January 20, 2026, 14:15 [IST]
Other articles published on Jan 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+