For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025: నో ఆర్‌టీఎమ్ కార్డ్.. ఐదుగురికి ఛాన్స్..! బీసీసీఐ రిటెన్షన్ రూల్స్ ఇవే..!

ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ పాలసీని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఖరారు చేసినట్లు తెలుస్తోంది. బుధవారం బెంగళూరు వేదికగా జరిగిన బీసీసీఐ 93వ సాధారణ సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో రిటెన్షన్ రూల్స్‌ను ఫైనలైజ్ చేసినట్లు సమాచారాం. ఫ్రాంచైజీలు కోరిన ఆర్‌టీమ్ కార్డ్‌‌‌ను బీసీసీఐ తిరస్కరించినట్లు తెలుస్తోంది.

అతి త్వరలోనే బీసీసీఐ ఐపీఎల్ 2025 రిటెన్షన్ పాలసీని అధికారికంగా ప్రకటించనుంది. ఓ జాతీయ వెబ్‌సైట్ కథనం ప్రకారం.. కొత్త రిటెన్షన్ పాలసీలో ఐదుగురి ఆటగాళ్లను రిటెన్ చేసుకోవచ్చు. గత మెగా వేలంలో లాగానే ఆర్‌టీమ్ కార్డ్స్‌కు అవకాశం లేదు. రిటెన్షన్ పాలసీని రూపొందించే ముందు బీసీసీఐ 10 ఫ్రాంచైజీల ఓనర్లతో సమావేశమై వారి సూచనలు, సలహాలు తీసుకున్నది.

BCCI likely to allow 5 retentions without any RTM card for IPL 2025 mega auction

ఈ సమావేశంలో ఆయా ఫ్రాంచైజీలు భిన్నమైన వాదనలు వినిపించినట్లు వార్తలు వచ్చాయి. కొందరు మెగా వేలం అవసరం లేదంటే.. మరికొందరు కావాలని, 8 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని, ఆర్‌టీమ్ కార్డ్స్ ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ప్రచారం జరిగింది.

బీసీసీఐ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే విధంగా రూల్స్ రూపొందించినట్లు తెలుస్తోంది. రైట్ టు మ్యాచ్ కార్డ్(ఆర్‌టీమ్)తో ఏదైనా జట్టు తమ ఆటగాడిని వేలంలో కొనుగోలు చేస్తే ఆ ధరను చెల్లించి తిరిగి తీసుకోవచ్చు. 2018 ఐపీఎల్ మెగా వేలంలో ఆర్‌టీఎమ్ కార్డ్‌ను చివరిసారిగా ఉపయోగించారు.

ఆ తర్వాత బీసీసీఐ ఆర్‌టీమ్ కార్డ్స్‌ను తొలగించింది. అయితే అప్‌కమింగ్ మెగా వేలంలో ఆర్‌టీఎమ్ కార్డ్స్ రూల్ ప్రవేశ పెట్టాలని మెజార్టీ ఫ్రాంచైజీలు డిమాండ్ చేసాయి. కానీ బీసీసీఐ మాత్రం వారి డిమాండ్ పట్టించుకోలేదు.

Story first published: Wednesday, September 25, 2024, 20:35 [IST]
Other articles published on Sep 25, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+