
ఆటలన్నీ ఆగమాగం..
కరోనా మహమ్మారి కారణంగా నాలుగు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్ ఆగిపోయిన విషయం తెలిసిందే. మార్చిలో జరగాల్సిన ఐపీఎల్-2020 సైతం వాయిదా పడింది. ఆసియా కప్, ప్రపంచకప్ వాయిదా పడటంతో సెప్టెబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు లీగ్‌ను యూఏఈలో నిర్వహించేందుకు బీసీసీఐ సమాయత్తమైంది. 2019-20 దేశవాళీ సీజన్ మార్చిలోనే ముగిసింది. సాధారణంగా ఆగస్టులో మళ్లీ మొదలవుతుంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ సారి సీజన్‌ను కుదించే అవకాశం ఉంది.

కరోనా రిస్క్‌కు ఓకే చెబుతూ..
ప్రస్తుతం నిర్వహించే ట్రైనింగ్ క్యాంప్స్‌లో పాల్గొనే ఆటగాళ్లు కరోనా రిస్క్‌ను అంగీకరిస్తూ సంతకాలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసేవరకు అనారోగ్య సమస్యలు ఉన్నవారు, 60 ఏళ్లకు పైబడిన వ్యక్తులు శిబిరాలకు రాకుండా నిషేధం విధించింది. క్రికెటర్లు ఇంటి నుంచి స్టేడియానికి, అట్నుంచి శిబిరానికి వెళ్లేటప్పుడు కఠిన నియమాలు పాటించాల్సి ఉంటుందని తెలిపింది. 'ఆటగాళ్లు, సహాయ సిబ్బంది, అధికారుల ఆరోగ్య, సంరక్షణ బాధ్యత పూర్తిగా రాష్ట్ర సంఘాలదే' అని బీసీసీఐ ఒకరు చెప్పడం గమనార్హం.

ఎన్-95 మాస్క్, కళ్లద్దాలు తప్పనిసరి..
శిబిరానికి ముందు ఆటగాళ్ల రెండు వారాల ప్రయాణ, ఆరోగ్య చరిత్రను వైద్యాధికారుల టీమ్ ఆన్‌లైన్ ప్రశ్నావళి ద్వారా సేకరిస్తుంది. ఎవరికైనా కొవిడ్ అనుమానిత లక్షణాలు ఉంటే ఆర్‌టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. తప్పుడు ఫలితాలు రాకుండా మొదటి, మూడో రోజు చేస్తారు. ఆటగాళ్లు ఎన్-95 మాస్క్ కచ్చితంగా ధరించాలి. కళ్లద్దాలు ధరించేందుకు ప్రోత్సహిస్తారు. శిబిరం మొదటి రోజు ప్రధాన వైద్యాధికారి ఆరోగ్య జాగ్రత్తలపై వెబినార్ నిర్వహిస్తారు. స్టేడియానికి సొంత వాహనాల్లోనే వచ్చేందుకు క్రీడాకారులను బోర్డు ప్రోత్సహిస్తోంది.


Click it and Unblock the Notifications
