Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: ఫ్రాంచైజీలకు బీసీసీఐ కీలక ఆదేశం.. ఇక వాటిపై నిషేధం!

ఐపీఎల్ 2026 సీజన్‌ క్వాలిఫయర్-2, ఫైనల్ ముంగిట ఫ్రాంచైజీలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. మ్యాచ్ సమయంలో ఆటగాళ్లు, సిబ్బంది స్మార్ట్ గ్లాసెస్‌తో పాటు అనధికారిక స్మార్ట్ పరికరాలను ఉపయోగించడంపై నిషేధం విధించింది. సాంకేతిక ఉల్లంఘనలు జరగవద్దని ఈ నిర్ణయం తీసుకుంది.

సీక్రెట్ కెమెరాలు, వీడియో రికార్డింగ్, స్టార్ట్ ఫోన్ ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్ గ్లాసెస్‌ను ఉపయోగించకూడదని ఆటగాళ్లు, సిబ్బందిని హెచ్చరించింది. ఐపీఎల్ 2026 ఆరంభంలో ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బీసీసీఐ యాంటీ కరప్షన్ సెక్యూరిటీ యూనిట్ అప్పటి నుంచి అత్యంత అప్రమత్తంగా ఉంది.

రోమీ భిందర్ వ్యవహారంతో..

ఇటీవలే రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన రోమీ భిందర్‌ టీమ్ డగౌట్‌లో మొబైల్ ఫోన్ ఉపయోగించడం తీవ్ర చర్చనీయాంశమైంది. దాంతో అతనికి రూ. 1 లక్ష జరిమానా విధించడంతో పాటు కఠిన హెచ్చరిక చేశారు. ఈ ఘటన బీసీసీఐని ఆలోచింపజేసింది. టీమ్ మేనేజర్ (డ్రెస్సింగ్ రూమ్‌లో మాత్రమే ఫోన్ అనుమతి, డగౌట్‌లో కాదు), టీమ్ అనలిస్ట్ మినహా ఆట సమయంలో అన్ని కమ్యూనికేషన్ పరికరాలు నిషేధమని ఫ్రాంచైజీలకు మరోసారి గుర్తుచేసింది. అంతేకాకుండా, మే నెల ఆరంభంలో ఏసీఎస్‌యూ జట్టు ప్రాంతాల్లో (డగౌట్‌లు, హోటల్స్) అనధికారిక వ్యక్తుల సంచారంపై కూడా హెచ్చరిక జారీ చేసింది.

BCCI Issues High Alert IPL Franchises Warned To Be Wary of Tech-Driven Cheating via Smart Glasses

సైకియా వార్నింగ్..

ఈ అంశాలపై బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా ఏఎన్‌ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, "ఈసారి, కొన్ని ఫ్రాంచైజీలు, ఆటగాళ్ళ ప్రవర్తనలో తేడాను మేం గమనించాం. చాలా మంది అనధికార వ్యక్తులు టీమ్ సభ్యులతో కలిసి తిరుగుతున్నారని, కొందరు అనధికార వ్యక్తులు హోటల్స్‌కు, ఆటగాళ్ల గదులకు లేదా టీమ్ అధికారుల గదులకు వస్తున్నారని మేము గుర్తించాం. ఇది మా అవినీతి నిరోధక ప్రోటోకాల్‌లకు పూర్తిగా విరుద్ధం.

టీమ్ ఓనర్స్, అధికారులు ఆటగాళ్లతో కలవడానికి అనుమతి లేని ప్రాంతాల్లో కలవడం కూడా మేం గమనించాము. కొన్ని ప్రోటోకాల్‌లను తప్పనిసరిగా పాటించాలి, అయితే వాటిలో కొన్ని సడలింపులను కూడా మేం చూశాము. దీనిని మేం చాలా సీరియస్‌గా తీసుకున్నాం. మేం ఒక సూచనను జారీ చేస్తున్నాం. ఇది చాలా కఠినంగా పాటించాటి. ఇప్పుడు తర్వాత ఏవైనా ఉల్లంఘనలు జరిగితే, బీసీసీఐ, ఐపీఎల్ చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాయి'అని సైకియా హెచ్చరించారు.

Story first published: Friday, May 29, 2026, 15:54 [IST]
Other articles published on May 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+