Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీనే కాదు ఎవ్వడైనా ఆ రూల్ పాటించాల్సిందే.. తేల్చేసిన బీసీసీఐ!

BCCI is unlikely to allow MS Dhoni to mentor CSKs South Africa T20 League team

న్యూఢిల్లీ: భారత ఆటగాళ్లు విదేశీ లీగ్స్ ఆడే విషయంలో తమ నిర్ణయం మారదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) స్పష్టం చేసింది. విదేశీ లీగ్స్ ఆడాలనుకుంటే భారత్ క్రికెట్‌తో తెగతెంపులు చేసుకోవాలని, అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని సూచించింది. ఎంతటి పెద్ద ఆటగాడికైనా ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే సౌతాఫ్రికా వేదికగా జరగనున్న టీ20 లీగ్‌లో ఐపీఎల్‌కు చెందిన ఫ్రాంచైజీలే అక్కడా జట్లను కొనుగోలు చేశాయి. దాంతో భారత ఆటగాళ్లను ఈ లీగ్‌‌కు అనుమతిస్తారనే ప్రచారం జరిగింది.

సౌతాఫ్రికా లీగ్‌లో మెంటార్‌గా...

సౌతాఫ్రికా లీగ్‌లో మెంటార్‌గా...

ఇక చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో జోహన్నెస్ బర్గ్ సూపర్ కింగ్స్ జట్టును కొనుగోలు చేసింది. ఈ జట్టుకు తమ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని మెంటార్‌గా నియమించాలని భావించింది. ఈ క్రమంలోనే బీసీసీఐ అనుమతి కోరింది. టీమిండియాకెప్టెన్‌గా మూడు టైటిల్స్ అందించిన ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా గుడ్ బై చెప్పడంతో అతనికి అనుమతి లభించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కేవలం మెంటార్‌గానే ఆ లీగ్‌ బరిలోకి దిగనున్నాడని కాబట్టి అతని అనుమతిని నిరాకరించకపోవచ్చని క్రికెట్ విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు.

షాకిచ్చిన బీసీసీఐ..

షాకిచ్చిన బీసీసీఐ..

బీసీసీఐ మాత్రం ధోనీకి షాకిచ్చింది. ధోనీతో పాటు ఎవ్వరైనా బోర్డు నిబంధనను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌కి ఇప్పటికే రిటైర్మెంట్ ఇచ్చినా ఐపీఎల్‌లో సీఎస్‌కే కెప్టెన్‌గా ఉన్నాడు ఎంఎస్ ధోనీ. 2021 సీజన్‌లో సీఎస్‌కేకు కెప్టెన్‌గా నాలుగో టైటిల్ కూడా అందించాడు. వచ్చే సీజన్‌లో చెన్నైలో మ్యాచులు ఆడిన తర్వాత ఐపీఎల్ నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. దీంతో సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పాల్గొనాలంటే మాహీ, ఐపీఎల్‌కి దూరం కావాల్సి ఉంటుంది.

T20 ప్రపంచకప్‌కు వాళ్లిద్దరూ దూరం,మరెలా? *Cricket | Telugu OneIndia
వచ్చే ఏడాది తర్వాతనే..

వచ్చే ఏడాది తర్వాతనే..

అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఐపీఎల్ తప్ప, ఏ క్రికెట్ లీగ్‌లోనూ ధోనీ ఆడటంలేదు . దీంతో ఐపీఎల్ లేదా సౌతాఫ్రికా టీ20 లీగ్‌... రెండింట్లో ఏదో ఒక్కదాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితుల్లోకి మాహీని నెట్టేసింది బీసీసీఐ. ఐపీఎల్‌లో మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఫ్రాంఛైజీల్లో ఒక్కటైన చెన్నై సూపర్ కింగ్స్‌ని ఇప్పట్లో వీడే ఆలోచనలో లేని ధోనీ, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పాల్గొనాలనే ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐపీఎల్ అనంతరం ధోనీ సేవలను మెంటార్‌గా తమ జట్లకు వాడుకుందమాని సీఎస్‌కే యాజమాన్యం నిర్ణయించుకుంది.

Story first published: Saturday, August 13, 2022, 16:01 [IST]
Other articles published on Aug 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+