పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వీసాల డిమాండ్‌పై బీసీసీఐ ఫైర్!

న్యూఢిల్లీ: భారత్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్ కోసం వీసాల మంజూరు విషయంపై లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చేసిన డిమాండ్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. పీసీబీ వైఖరి తమను ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపింది. ఈ తరహా వ్యాఖ్యలు అపరిపక్వతతో కూడినవని పేర్కొంది. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో భారత్ వేదికగా టీ20 ప్రపంచ కప్ జరగనున్న విషయం తెలిసిందే.

లిఖిత పూర్వక హామీ..
ఈ మెగా టోర్నీలో పాల్గొనడానికి పాకిస్థాన్ ఆటగాళ్లతో పాటు అభిమానులు, జర్నలిస్టులకు కూడా వీసాలు మంజూరు చేయాలని పీసీబీ చైర్మన్ ఎహ్‌సాన్ మణి డిమాండ్ చేశారు. ఈ విషయంపై మార్చి నెలాఖరులోగా బీసీసీఐ తమ నిర్ణయం చెప్పాలన్నారు. లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా కుదరకపోతే వేదికను యూఏఈకి మార్చాలని ఐసీసీకి లేఖ రాస్తమని ఎహ్‌సాన్ మణి హెచ్చరించారు.

ఆశ్చర్యంగా ఉంది..
ఇక ఎహ్‌సాన్ మణి వ్యాఖ్యలను తమను ఆశ్చర్యానికి గురిచేశాయని బీసీసీఐ అధికారి ఒకరు అన్నారు. "ఎహ్‌సాన్ మణి వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆయనకు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో మంచి వృత్తిగత సంబంధాలు ఉన్నాయి. ఆయనొక పెద్ద మనిషి. కరోనా సమయంలో శశాంక్ మనోహర్ వ్యవహారంలో దాదాకు మార్గదర్శిగా వ్యవహరించారు. అలాంటి వ్యక్తి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు అపరిపక్వతతో కూడినవని భావించొచ్చు" అని సదరు అధికారి చెప్పుకొచ్చాడు.

రాజకీయ సమస్యగా..
'టీ20 టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రయత్నాల్లో భాగంగానే మణి ఈ తరహా వ్యాఖ్యలు చేశారనిపిస్తోంది. ఒక బోర్డు ఒక విషయంపై కచ్చితమైన హామీ ఇచ్చే నియమమేమీ లేదని వారికి తెలుసు. బహుశా, ఈ అంశాన్ని రాజకీయ సమస్యగా మార్చాలని చూస్తున్నారేమో. అది వారి ఇష్టం. 'అని స్పష్టం చేశారు. ఇక భారత దేశంలో అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనడానికి అథ్లెట్లు ఉన్న అన్ని దేశాలు అర్హులే. వారికి వీసాల మంజూరు చేస్తాం" అని 2019 జూన్ 18న అప్పటి క్రీడా కార్యదర్శి రాధే శ్యామ్ స్పష్టంగా పేర్కొన్నారు.

ఆసియా కప్ వాయిదా..
భారత క్రికెట్ జట్టు ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరితే ఆసియాకప్‌ను వాయిదా వేయక తప్పదని ఎహ్‌సాన్ మణి అన్నారు. కరోనా కారణంగా గతేడాది జరగాల్సిన ఆసియాకప్ వాయిదా పడింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జూన్‌లో ఈ మెగా టోర్నీ జరగాల్సి ఉంది. అయితే అదే సమయంలో డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా జరగాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే భారత జట్టు ఫైనల్‌కు వెళ్లే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇంగ్లండ్‌తో మార్చి 4 నుంచి అహ్మదాబాద్ వేదికగా జరగనున్న చివరి టెస్ట్‌ను కనీసం డ్రా చేసుకున్నా కోహ్లీసేన ఫైనల్‌కు వెళ్తుంది. అలా కాకుండా ఓడితే మాత్రం ఆసీస్ టైటిల్ ఫైట్‌కు సిద్దమవుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications