ఐపీఎల్ 2018: దేశ వ్యాప్తంగా 36 ఫ్యాన్ పార్కులు

Posted By:
BCCI to have 36 IPL Fan Parks nationwide this year: Official

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్ కోసం దేశ వ్యాప్తంగా 36 ఫ్యాన్‌ పార్కులు ఏర్పాటు చేసినట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు. స్టేడియాలకు వెళ్లి మ్యాచ్‌లు చూడలేని అభిమానుల కోసం బీసీసీఐ 2015లో ఈ ఫ్యాన్‌ పార్కులను అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

ఈ ఫ్యాన్ పార్కులను ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇవ్వని రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా మొత్తం 19 రాష్ట్రాల్లోని 36 సిటీల్లో ఈ ఫ్యాన్‌ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఫ్యాన్ పార్కుల్లో పెద్ద పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేసి ఐపీఎల్ మ్యాచ్‌లను లైవ్ ప్రసారం చేస్తారు.

ముఖ్యంగా వీకెండ్‌ మ్యాచ్‌లకు ఈ ఫ్యాన్ పార్కుల్లో క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. అంతేకాదు మహిళలు, చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా ఈ ఫ్యాన్ పార్కుల్లో ఏర్పాట్లు చేస్తారు. ఈ ఫ్యాన్‌ పార్కుల్లోకి క్రికెట్ అభిమానులకు ఉచితంగానే ప్రవేశం కల్పిస్తారు.

ఐపీఎల్ ఆరంభ వేడుకలు: తమన్నా డ్యాన్స్ రిహార్సల్స్ (ఫోటోలు)

ఐపీఎల్‌ను అభిమానులకు మరింత దగ్గర చేసేందుకు ఈ ఫ్యాన్ పార్కులు ఎంతగానో ఉపయగపడతాయని బీసీసీఐ నిర్వాహకులు తెలిపారు. గుజరాత్, రాజ్‌కోట్, సూరత్, నాందేడ్, రాయ్‌పూర్‌, భోపాల్‌, రాజ్‌కోట్‌, తిరునెవెల్లిలో ఈ పార్కులు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

శనివారం నుంచి ఐపీఎల్ 11వ సీజన్‌కు తెరలేవనుంది. మొత్తం 51 రోజుల పాటు జరిగే ఈ సీజన్‌లో 8 జట్లు దేశవ్యాప్తంగా 9 ప్రధాన నగరాల్లో 60 మ్యాచ్‌లు ఆడనున్నాయి. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కి ముంబైలోని వాంఖడే మైదానం ఆతిథ్యమిస్తోంది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Saturday, April 7, 2018, 12:04 [IST]
Other articles published on Apr 7, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి