Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Smriti Mandhana: భారత అభిమానులకు గుడ్ న్యూస్.. మెగా టోర్నీకి స్టార్ ఓపెనర్ రెడీ!

BCCI Gives Update On Smriti Mandhanas Condition After She Was Hit On Head During Warm-up Match

న్యూఢిల్లీ: భారత అభిమానులకు గుడ్ న్యూస్. మహిళల టీ20 ప్రపంచకప్ ముందు గాయపడిన భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన కోలుకుంది. ప్రపంచకప్​లో భాగంగా సౌతాఫ్రికా మహిళలతో జరిగిన వార్మప్​ మ్యాచ్​లో షబ్నీమ్ ఇస్మాయిల్ విసిరిన బౌన్సర్.. వేగంగా వచ్చి మంధాన హెల్మెట్‌కు బ‌లంగా తాకింది. దీంతో మంధాన రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరి, ఆ తర్వాత ఫీల్డింగ్‌కు కూడా రాలేదు. దీంతో మంధాన తలకు పెద్ద గాయమైందేమోన‌ని ఆమె అభిమానులు ఆందోళన చెందారు. కీలక టోర్నీకి ముందు మంధాన జట్టుకు దూరమైతే టీమిండియా విజ‌యావ‌కాశాల‌ను దెబ్బ‌తీస్తుంద‌ని వారు అభిప్రాయపడ్డారు.

గాయపడిన భారత స్టార్​ బ్యాటర్​ స్మృతి మంధాన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిసింది. దీంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆమె మళ్లీ ప్రాక్టీస్​ ప్రారంభించినట్లు సమాచారం. ప్రపంచకప్​కు అందుబాటులోనే ఉంటుందని క్రికెట్​ వర్గాలు తెలిపాయి.

అయితే మంధాన తలకు తగిలిన గాయం పెద్దది కాదని, కన్‌కషన్ ఏమీ జరగలేదని జట్టు వర్గాలు ఇవాళ వెల్ల‌డించ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, మ‌హిళ‌ల వ‌న్డే ప్రపంచకప్ మార్చి 4 నుంచి ప్రారంభంకానున్న సంగ‌తి తెలిసిందే. న్యూజిలాండ్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఈ మెగా టోర్నీలో మార్చి 6న టీమిండియా.. చిర‌కాల ప్ర‌త్య‌ర్ధి పాకిస్థాన్‌తో త‌ల‌ప‌డ‌నుంది. అనంత‌రం మార్చి 10న న్యూజిలాండ్‌తో, మార్చి 12న వెస్టిండీస్‌తో, మార్చి 16న ఇంగ్లండ్‌తో, మార్చి 19న ఆస్ట్రేలియాతో, 22న బంగ్లాదేశ్‌తో, మార్చి 27న దక్షిణాఫ్రికాతో భారత జట్టు త‌ల‌ప‌డ‌నుంది.

భారత ప్రపంచకప్ జట్టు: మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, రిచా ఘోష్, యాస్తికా భాటియా, స్నేహ రాణా, ఝులన్ గోస్వామి, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా భాటియా, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్

Story first published: Monday, February 28, 2022, 22:47 [IST]
Other articles published on Feb 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+