Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాతరోజుల్లోకి వెళ్లి పండగ చేస్కోండి: బీసీసీఐ

BCCI Delights Fans With New Doordarshan Deal For Showcasing 2000s Iconic Matches In India

హైదరాబాద్: కరోనా కారణంగా ప్రపంచమే అతలాకుతలమైంది. ఈ ప్రాణాంతక వైరస్ ధాటికీ యావత్ ప్రపంచం స్వీయ నిర్భంధంలోకి వెళ్లింది. భారత్‌లో కూడా ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ విధించారు. ఇక ఆటలైతే ఆగమాగమయ్యాయి. టోక్యో ఒలింపిక్సే వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. క్రికెట్ టోర్నీలన్నీ వాయిదాపడ్డాయి. ప్రతీ వేసవిలో అభిమానులను అలరించే ఐపీఎల్ ఏప్రిల్ 15కు వాయిదాపడింది. కానీ ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్ నిర్వహణపై సందిగ్దత నెలకొంది. ఓవైపు దేశంలో పెరుగుతున్న కరోనా బాధితుల సంఖ్య.. మరోవైపు యావత్ ప్రపంచమంతా లాక్ డౌన్‌లో ఉండటంతో ఈ టోర్నీ జరపడంపై బీసీసీఐ ఎటు తేల్చుకోలేకపోతుంది.

దీంతో స్టార్ క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. ఇక భారత్‌లో ఏప్రిల్ 14వరకు విధించిన లాక్‌డౌన్‌ను కూడా పొడిగించే అవకాశం ఉంది. అటు టీవీ షూటింగ్‌లు కూడా బందయ్యాయి. అటు పనుల్లేక.. ఇటు ఆటలు.. టీవీ ప్రోగ్రామ్‌లు లేక ప్రజలు బోరింగ్‌గా ఫీలవుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే దూర‌ద‌ర్శ‌న్ ప‌లు పాత కార్య‌క్ర‌మాల‌ను రీ టెలికాస్ట్ చేస్తుంది. ఈ క్ర‌మంలో క్రికెట్ ఫ్యాన్స్ కు కూడా బీసీసీఐ శుభ‌వార్త చెప్పింది. లాక్‌డౌన్ స‌మ‌యం ఇంకా 8 రోజులు ఉండ‌టంతో..వారిని ఇంటివ‌ద్దే ఉంచేందుకు భార‌త క్రికెట్ టీమ్ ఆడిన పాత మ్యాచుల‌ను తిరిగి ప్ర‌సారం చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

2000 సంవ‌త్స‌రం ప్రారంభం నుంచి భారత క్రికెట్ మ్యాచ్‌ల హైలెట్స్.. ఏప్రిల్ 7 నుండి ప్రసారం చేయనున్నట్లు బీసీసీఐ సోమవారం ప్రకటించింది. మూడు మ్యాచుల హైలెట్స్ .. ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 6 వ‌ర‌కు ప్ర‌తిరోజు టెలికాస్ట్ చేస్తామ‌ని పేర్కొంది. వీటిని డీడీ స్పోర్ట్స్ ఛానెల్‌లో వీక్షించ‌వ‌చ్చ‌ని తెలిపింది.

ఈ మ్యాచ్‌లలో 2003 లో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన ట్రై-సిరీస్, 2000 లో దక్షిణాఫ్రికా భారత పర్యటన, 2001 లో ఆస్ట్రేలియా భారత పర్యటన (వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ రోజంతా బ్యాటింగ్ చేసి అద్భుత విజ‌యాన్ని అందించిన‌ ప్రసిద్ధ కోల్‌కతా టెస్టుతో సహా).. 2002 లో వెస్టిండీస్ భారత పర్యటన , 2005 లో శ్రీలంక భారత పర్యటన లాంటి సూప‌ర్ మ్యాచ్ లు ఉన్నాయి. ఇంకేంది.. మీ టీవీల్లో మీ తరం ఆటను మీ పిల్లలతో ఆస్వాదించండి.!

Story first published: Tuesday, April 7, 2020, 15:24 [IST]
Other articles published on Apr 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+