
రోహిత్ గాయంపై నో క్లారిటీ..
రోహిత్ గాయం వ్యవహారం ఒక రకమైన అనిశ్చితి, గందరగోళం కనిపించిందని ఆస్ట్రేలియాతో ఫస్ట్ వన్డే ముందు విరాట్ కోహ్లీ అన్నాడు. ‘దుబాయ్‌లో సెలక్షన్ కమిటీ సమావేశానికి రెండు రోజుల ముందు మాకు ఒక మెయిల్ వచ్చింది. ఐపీఎల్‌లో గాయపడిన కారణంగా రోహిత్ శర్మ సెలక్షన్‌కు అందుబాటులో లేడని, అతనికి కనీసం రెండు వారాల విశ్రాంతి, రీహాబిలిటేషన్ అవసరమని అందులో ఉంది. దీనికి సంబంధించి మంచి చెడులన్నీ రోహిత్‌కు చెప్పామని, అతను దానిని అర్థం చేసుకున్నాడని కూడా ఉంది. అందుకే ఎంపిక చేయడం లేదని చెప్పారు. అయితే ఆ తర్వాత అతను ఐపీఎల్ ఆడటంతో అంతా బాగుందని, ఆస్ట్రేలియా విమానం ఎక్కుతాడని మేం అనుకున్నాం. కానీ అది జరగలేదు. మాతో రోహిత్ ఎందుకు ప్రయాణించ లేదో మాకెవరికీ సమాచారం లేదు.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. దాంతో రోహిత్ గాయంపై బోర్డు నిర్లక్ష్యంగా వ్యవహరించందనే విమర్శలు వెల్లువెత్తాయి. కనీసం కెప్టెన్‌కు కూడా సమాచారమివ్వారా? అనే వ్యాఖ్యలు వినిపించాయి.

కోహ్లీ తెలుసుకోవాల్సింది..!
ఇక రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతోనే ఆస్ట్రేలియా వెళ్లలేదని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు. తండ్రి కరోనా బారిన పడటంతో అతను ఐపీఎల్ ముగిసిన వెంటనే నేరుగా ఆస్ట్రేలియా వెళ్లకుండా భారత్‌కు తిరిగొచ్చాడన్నాడు. పైగా రోహిత్ తండ్రి హార్ట్ పెషెంట్ అని, ఈ విషయం కోహ్లీకి తెలియదన్నాడు. అయితే ఓ కెప్టెన్‌గా తన డిప్యూటీకి ఏమైందనే విషయం తెలుసుకోలేడా? అనే వాదన తెరపైకి వచ్చింది. కమ్యూనికేషన్ విస్తరించిన ఈ యుగంలో కూడా రోహిత్‌కు ఏమైందో తెలియదని విరాట్ చెప్పడం విచారకరమని ఆశిష్ నెహ్రా వంటి మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేశారు. రోహిత్, కోహ్లిలను ఒకరి ముందు మరొకరిని కూర్చోబెట్టి మాట్లడకపోవడం బీసీసీఐ తప్పిదమేనని విమర్శించారు.

రోహిత్‌తో మాట్లాడించిన బీసీసీఐ..
ఈ క్రమంలోనే బీసీసీఐ.. విరాట్ కోహ్లీని రోహిత్‌తో మాట్లాడించే ప్రయత్నం చేసిందని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇద్దరిని ముఖా ముఖిగా నిలబెట్టిందని ముంబై మిర్రర్ పేర్కొంది. ఈ కాన్ఫరెన్స్‌లో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, సెలెక్షన్ కమిటీ చైర్మన్ సునీల్ జోషీ కూడా పాల్గొన్నారని తెలిపింది. రోహిత్ ఫిట్‌నెస్‌పై కోహ్లీ, రవిశాస్త్రి ఆరా తీశారని పేర్కొంది. ఇక డిసెంబర్ 11న రోహిత్‌కు నిర్వించే ఫిట్‌నెస్ తర్వాతే అతని రాకపై నిర్ణయం తీసుకోనున్నారని స్పష్టం చేసింది. అలాగే టెస్ట్ సిరీస్ కోసం రోహిత్ శర్మ ఆస్ట్రేలియ వెళ్లే అవకాశం ఉందని కూడా తెలిపింది.

వెనుకపడ్డ కోహ్లీ సేన..
ఎన్నో అంచనాల మధ్య ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన కోహ్లీ సేన ఆశించిన ఆరంభాన్ని అందుకోలేకపోయింది. సిడ్నీ వేదికగా జరిగిన ఫస్ట్ వన్డేలో 66 పరుగులతో చిత్తుగా ఓడి మూడు వన్డేల సిరీస్‌లో 0-1తో వెనుకపడింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో దారుణంగా విఫలమై ఘోరపరాజయాన్ని చూసింది. పేలవ ఆటతీరుతో ఆదివారం జరిగే రెండో వన్డేలో తప్పక గెలవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. ఫస్ట్ వన్డేలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు మూకుమ్మడిగా విఫలమయ్యాడు. హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్ పోరాడినా ఫలితం లేకుండా పోయింది.
స్మిత్ మెరుపు సెంచరీ.. చెలరేగిన వార్నర్, మ్యాక్స్‌వెల్.. భారత్ టార్గెట్ 390!


Click it and Unblock the Notifications
