IND vs SL: చరిత్ర సృష్టించిన అకిబ్ నబీ.. తొలి జమ్మూ పేసర్‌గా రికార్డ్!
జమ్మూ కశ్మీర్ పేసర్, రంజీ సెన్సేషన్ అకిబ్ నబీకి ఎట్టకేలకు టీమిండియాలో చోటు దక్కింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ జమ్మూ పేస్ సెన్సేషన్‌కు భారత సెలెక్టర్లు అవకాశం కల్పించారు. మోకాలి గాయంతో శ్రీలంక పర్యటనకు దూరమైన భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో అకీబ్ నబీని ఎంపిక చేశారు. ఈ మేరకు సోమవారం బీసీసీఐ ఓ ప్రకటనను విడుదల చేసింది.
'శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు జస్‌ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో అయిన ఎడమ మోకాలి గాయం నుంచి బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దాంతో అతని స్థానంలో అకిబ్ నబీని భారత పురుషుల సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. జమ్మూ కశ్మీర్ పేసర్ తొలి టీమిండియా పిలుపును అందుకున్నాడు.

గత రెండు రంజీ ట్రోఫీ సీజన్లలో నబీ 104 వికెట్లు పడగొట్టాడు. గత సీజన్‌లో 60 వికెట్లు తీసి తన జట్టుకు తొలి రంజీ ట్రోఫీ అందించాడు. ఇటీవల శ్రీలంకలో పర్యటించిన భారత-ఏ జట్టులో కూడా నబీ ఉన్నాడు. రెండు అనధికారిక టెస్ట్‌ల్లో 6 వికెట్లు తీసాడు.'అని బీసీసీఐ తమ ప్రకటనలో పేర్కొంది.
జమ్మూ కశ్మీర్ నుంచి భారత టెస్ట్ టీమ్‌కు ఎంపికైన తొలి ప్లేయర్‌గా అకిబ్ నబీ చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు జమ్మూ కశ్మీర్ నుంచి టెస్ట్‌ల్లో భారత జట్టుకు ఎవరూ ప్రాతినిథ్యం వహించలేదు. గాయంతో ఇబ్బంది పడుతున్న బ్యాటర్ సాయి సుదర్శన్ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. అతను ఫిట్‌నెస్ క్లియర్ చేస్తేనే ఆడుతాడని స్పష్టం చేసింది. ఆగస్ట్ 15 నుంచి శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్త్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ సిరీస్ గెలవడం కీలకం.
శ్రీలంక పర్యటనకు భారత జట్టు(అప్‌డేట్): శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సరాన్ష్ జైన్, అకీబ్ నబీ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

