బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన బీసీసీఐ.. అఫ్గాన్‌తో భారత టీ20 సిరీస్ ఖరారు!
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)కి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) బిగ్ షాకిచ్చింది. సెప్టెంబర్‌లో తమతో సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా వస్తుందని ఆశించిన బీసీబీకి నిరాశే ఎదురైంది. అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌ను ఖరారు చేసి బంగ్లా పర్యటనకు వెళ్లడం లేదని పరోక్షంగా వెల్లడించింది.
సెప్టెంబర్‌లో అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అఫ్గాన్ క్రికెట్ బోర్డు వెల్లడించినట్లుగానే ఢిల్లీ వేదికగా మూడు టీ20ల సిరీస్ జరగనుంది. భారత్‌లోనే అఫ్గాన్ టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఢిల్లీ మైదానాన్ని అఫ్గాన్ హోమ్ గ్రౌండ్‌గా ఎంచుకుంది. గత జూన్‌లో భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య ఏకైక టెస్ట్, మూడు వన్డేల సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే.

భారత్, అఫ్గానిస్థాన్ మధ్య సెప్టెంబర్ 13న తొలి టీ20, సెప్టెంబర్ 15 రెండో టీ20, సెప్టెంబర్ 19న మూడో టీ20 జరగనుంది. భారత క్రికెట్ బోర్డు ఎప్పుడూ అఫ్గానిస్థాన్‌కు అండగా ఉంటుందని బీసీసీఐ ప్రెసిడెంట్ మిథున్ మన్హాస్ తెలిపారు. అఫ్గాన్ క్రికెట్ అభివృద్ధి కోసం మద్దతు ఇస్తామని, అత్యున్నత స్థాయిలో పోటీ పడేలా వారికి అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని చెప్పాడు. ఈ క్రమంలోనే ఆ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్‌ను ఏర్పాటు చేశామని, టాప్ టీమ్స్‌తో ఆడటం వల్ల వెలకట్టలేని అనుభవం వస్తుందని అభిప్రాయపడ్డాడు.
భారత్ వేదికగా అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు ఆతిథ్యం ఇస్తున్న సిరీస్‌కు బీసీసీఐ అండగా ఉంటుందని సెక్రటరీ దేవజిత్ సైకియా అన్నారు. మైదానంలో ఇరు జట్ల మధ్య పోరు చాలా ఆసక్తికరమని, నాణ్యమైన క్రికెటర్లు ఉన్నారని పేర్కొన్నారు. భారత్‌లోనూ అఫ్గాన్ ఆటగాళ్లకు అభిమానులు ఉన్నారంటే వారి ఆటతీరే కారణమని, ఇటీవల ఒక టెస్ట్, వన్డే సిరీస్ జరిగిందని, మూడు ఫార్మాట్లలోనూ ఇరు జట్లు తలపడేందుకు ఉన్న అవకాశాలను ఏ మాత్రం వదులుకోమని స్పష్టం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

