Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మా ఆటగాళ్లు హోటల్లో కూర్చోలేరు.. క్వారంటైన్‌ సమయం కుదించాలి: గంగూలీ

BCCI chief Sourav Ganguly hoping for shorter quarantine period for Team India during Australia tour

న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత జట్టుకు విధించే క్వారంటైన్‌ వ్యవధి తగ్గించాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. మిగతా వాటితో పోలిస్తే ఆసీస్‌లో కరోనా ప్రభావం తక్కువగా ఉన్న నేపథ్యంలో ఆటగాళ్లను క్వారంటైన్‌ పేరిట రెండు వారాలపాటు హోటల్‌ గదులకే పరిమితం చేయకూడదని అభిప్రాయపడ్డాడు. కరోనా కారణంగా మారిన క్రికెట్‌ నిబంధనల ప్రకారం.. ఆటగాళ్లు రెండు వారాలు పాటు క్వారంటైన్‌లో ఉన్న తర్వాత వాళ్లకు వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. నెగెటివ్‌గా తేలితేనే మైదానంలోకి అనుమతిస్తారు.

క్వారంటైన్‌ సమయం కుదించాలి:

క్వారంటైన్‌ సమయం కుదించాలి:

'ఇప్పటికే ఆస్ట్రేలియాతో సిరీస్‌ ఖరారైంది. డిసెంబర్‌లో భారత జట్టు అక్కడికి వెళ్తుంది. ఆటగాళ్లకు విధించే క్వారంటైన్‌ రోజులను తగ్గిస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే..వాళ్లు అంతదూరం వెళ్లి హోటల్‌ గదుల్లో రెండు వారాల పాటు ఉండాలని మేం కోరుకోవట్లేదు. అది నిరాశను కలిగిస్తుంది. మెల్‌బోర్న్‌ మినహా ఆస్ట్రేలియాలో వైరస్‌ తీవ్రత ఎక్కువగా లేదు. ఆ రకంగా చూసుకుంటే ఆటగాళ్లు తక్కువ రోజులే క్వారంటైన్‌లో ఉండి తిరిగి క్రికెట్‌ ఆడతారనిపిస్తోంది' అని సౌరవ్ గంగూలీ చెప్పాడు.

పదవిలో ఉంటానో లేదో తెలీదు:

పదవిలో ఉంటానో లేదో తెలీదు:

ఆస్ట్రేలియాతో సిరీస్‌ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ కెరీర్‌ను నిర్వచించబోతుందని సౌరవ్ గంగూలీ అన్నాడు. "డిసెంబర్‌ వరకూ పదవిలో ఉంటానో లేదో తెలీదు. కానీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి మాత్రం ఈ సిరీస్‌ ఓ మైలురాయి కానుంది. అతనితో తరచుగా మాట్లాడుతున్నా. 'నువ్వు ఫిట్‌నెస్‌ కొనసాగించాలి. ఆరు నెలలుగా నువ్వు క్రికెట్‌ ఆడలేదు. నీ అత్యుత్తమ బౌలర్లను ఫిట్‌గా ఉంచేలా చూసుకుని, ఆ సిరీస్‌కు సిద్ధం చేయాలి. మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ‌, హార్దిక్‌పాండ్యా ఇలా ఎవరైనా కావొచ్చు కానీ వాళ్లు ఆస్ట్రేలియాకు పూర్తి ఫిట్‌నెస్‌తో వెళ్లాలి' అని అతనికి చెప్పా" అని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు.

చైర్మన్‌ అయ్యేందుకు తొందరేం లేదు:

చైర్మన్‌ అయ్యేందుకు తొందరేం లేదు:

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చైర్మన్‌ అయ్యేందుకు తొందరేం లేదని, తన వయసు ఇంకా తక్కువేనని బీసీసీఐ బాస్ సౌరవ్‌ గంగూలీ అన్నాడు. 'ఐసీసీలో పరిస్థితి మారింది. ఒకవేళ ఐసీసీ స్వతంత్ర చైర్మన్‌గా ఉంటే ప్రస్తుతం బోర్డులో ఉన్న పదవిని వదిలేయాలి. ఇది బీసీసీఐ చేసిన మార్పు కాదు.. ఐసీసీ తెచ్చిందే. బీసీసీఐ ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం బోర్డులో రెండు పదవుల్లో కొనసాగకూడదు. అయితే ఐసీసీలో ఉండొచ్చు అలాగే మధ్యలోనే బీసీసీఐని వదిలి వెళ్లేందుకు అనుమతి దక్కుతుందో లేదో. నేను తొందరపడడం లేదు. నాకు ఇంకా చాలా వయసు ఉంది. ఇప్పుడు కాకపోతే మళ్లీ ఎప్పుడైనా ఆ స్థానానికి వెళ్లొచ్చనుకుంటున్నా' అని గంగూలీ తెలిపాడు.

ఈ అరెస్ట్‌ నల్ల జాతీయులపై వివక్ష చూపేవారికి ఓ గుణపాఠం కావాలి: ఆర్చర్

Story first published: Monday, July 13, 2020, 12:16 [IST]
Other articles published on Jul 13, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+