ఈ అరెస్ట్ నల్ల జాతీయులపై వివక్ష చూపేవారికి ఓ గుణపాఠం కావాలి: ఆర్చర్

సౌతాంప్టన్: అమెరికా నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య తరువాత జాతి వివక్షకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది ప్లేయర్లు ఈ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ తమ గళాన్ని వినిపించారు. ఇక కరోనా వైరస్ ఉద్ధృతి తర్వాత జరుగుతున్న మ్యాచ్‌లలో 'బ్లాక్ లైవ్స్ మేటర్'కు ఆటగాళ్లు అందరూ మద్దతు ఇస్తున్నారు. జూన్ 17న ఫుట్‌బాల్ ప్రీమియర్ లీగ్ తిరిగి ప్రారంభమైనప్పుడు ఆటగాళ్లందరూ జాత్యహంకారానికి వ్యతిరేకంగా మద్దతును చూపించడానికి తమ జెర్సీపై పేర్లకు బదులుగా 'బ్లాక్ లైవ్స్ మేటర్'తో బరిలోకి దిగారు.

జహాకు జాత్యహంకార సందేశాలు:
జూన్ 17న ఆస్టన్ విల్లాతో జరిగే మ్యాచ్‌కు ముందు ఓ 12 సంవత్సరాల బాలుడు క్రిస్టల్ ప్యాలెస్ ఫార్వర్డ్ విల్ఫ్రైడ్ జహాకు జాత్యహంకార సందేశాలను పంపాడు. 'జాత్యహంకారంను వ్యవస్థ మరియు విద్య మార్చవలసి ఉంటుంది. అంతేకాని ఆటగాళ్లు జెర్సీలపై లోగో ధరించడం, మోకాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేయడం లాంటివి పనికిరావు' అని ఆ బాలుడు జహాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పంపాడు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న జహా.. ఆ సందేశమును స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

12 ఏళ్ల అబ్బాయి అరెస్టు:
'ఈ సందేశం ఆస్టన్ విల్లా అభిమాని నుండి వచ్చిందని స్పష్టంగా తెలుస్తోంది. అతను జహాను దెయ్యం వలె పరిగణించాడు. ఇప్పటికైనా మేల్కొనండి' అని విల్ఫ్రైడ్ జహా ట్వీట్ చేశాడు. విషయం తెలుసుకున్న ఇంగ్లాండ్‌లోని వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ పోలీసులు ఆ 12 సంవత్సరాల బాలుడుని అరెస్ట్ చేశారు. 'ఈ రోజు ఒక ఫుట్‌బాల్ ఆటగాడికి పంపిన వరుస జాత్యహంకార సందేశాలపై అప్రమత్తం అయ్యాం. వాటిని పరిశీలించి ఓ 12 ఏళ్ల అబ్బాయిని అరెస్టు చేశాం. జాత్యహంకారం సహించవద్దు' అని పోలీసు శాఖ ట్వీట్ చేసింది.

ఓ గుణపాఠం కావాలి:
వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ పోలీసులు పోస్ట్ చేసిన ట్వీట్‌పై ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ స్పందించాడు. భవిష్యత్తులో ఎవరైనా జాతి వివక్షపై వ్యాఖ్యలు చేయకుండా ఈ అరెస్ట్ అడ్డుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 'ఈ అరెస్ట్ నల్ల జాతీయులపై వివక్ష చూపేవారికి ఓ గుణపాఠం కావాలి' అని ఆర్చర్ ట్వీట్ చేశాడు. గతంలో తాను కూడా జాతి వివక్షపై వ్యాఖ్యలు ఎదుర్కొన్నా అని ఆర్చర్ చెప్పిన విషయం తెలిసిందే. ఆర్చర్ ప్రస్తుతం విండీస్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడుతున్నాడు.

దక్షిణాఫ్రికాలోనూ జాత్యాహంకారం:
తాజాగా 'బ్లాక్ లైవ్స్ మేటర్' ఉద్యమానికి తాను మద్దతు ఇస్తానని దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ లుంగి ఎన్గిడి పేర్కొన్నాడు. 'బ్లాక్ లైవ్స్ మేటర్‌కు నేను మద్దతు ఇస్తున్నా. ఈ అంశంలో ఇతర ఆటగాళ్ల మద్దతు నాకు ఉంటుందనే ఆశిస్తున్నా. గడిచిన కొన్ని సంవత్సరాల్లో దక్షిణాఫ్రికాలోనూ జాత్యాహంకారం జరగుతుంది. క్రికెట్‌లోనూ ఇది కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బ్లాక్ లైవ్స్ మేటర్‌కు మా జట్టులోని ఆటగాళ్లు కూడా కలిసి వస్తారని ఆశిస్తున్నా' అని పేర్కొన్నాడు.
బ్లాక్‌వుడ్ సూపర్ ఇన్నింగ్స్.. ఇంగ్లండ్‌పై విండీస్ విజయం.. తొలి బయోబబుల్ టెస్టు సక్సెస్!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications