
విశ్రాంతి పేరిట పక్కనపెట్టాం..
టీమిండియా సీనియర్ ఆటగాళ్లు పూర్తి స్థాయి ఫిట్‌నెస్ కోసం డోపింగ్‌లో పట్టుబడని ఇంజెక్షన్లు ఉపయోగిస్తారని చెప్పిన చేతన్ శర్మ.. రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ టీ20 కెరీర్ ముగిసిందని తెలిపాడు.'శుభ్‌మన్ గిల్‌కు అవకాశం ఇవ్వడం కోసం కోహ్లీ, రోహిత్ లాంటి పెద్ద స్టార్లకు టీ20 ఫార్మాట్ నుంచి విశ్రాంతినిచ్చాం. భవిష్యత్తులో రోహిత్ శర్మ టీ20 క్రికెట్ ప్రణాళికల్లో ఉండడు. హార్దిక్ పాండ్యానే దీర్ఘ కాలం కెప్టెన్‌గా కొనసాగుతాడు.

రోహిత్ టీ20 కెరీర్ ముగిసింది..
సూర్యకుమార్, ఇషాన్‌కిషన్, దీపక్ హుడా, శుభ్‌మన్ గిల్.. ఇలాంటి 15-20 మంది యువ ఆటగాళ్లను జట్టులోకి నేనే తెచ్చాను. ఇషాన్ కిషన్, శుభ్‌మన్‌ల చక్కటి ఫామ్ సంజు శాంసన్, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్‌ల భవితవ్యాన్ని ప్రమాదంలో పడేసింది. భారత జట్టులో రెండు వర్గాలు ఉన్నాయి.
ఓ వర్గాన్ని రోహిత్ శర్మ నడిపిస్తే, మరొకటి విరాట్ కోహ్లీ నేతృత్వంలో నడుస్తుంది. అయితే కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. కోహ్లీ ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడ్డపుడు రోహిత్ శర్మ అండగా నిలిచాడు. రోహిత్, కోహ్లీ మధ్య అహం సమస్యగా మారింది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలు నన్ను గుడ్డిగా నమ్ముతారు. ఆ ఇద్దరూ మా ఇంటికి వచ్చారు. హార్దిక్ పాండ్యా తరచుగా నన్ను కలుస్తాడు.

బుమ్రా సైతం ఇంజెక్షన్లతోనే..
జస్‌ప్రీత్ బుమ్రా సైతం ఇంజెక్షన్లతోనే మ్యాచ్‌లు ఆడి గాయం పెద్దది చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌కు బుమ్రా ఇంజెక్షన్స్ సాయంతోనే ఆడించారు. అతని గాయం నేపథ్యంలో మూడో మ్యాచ్‌లో ఆడించాలని నేను సూచించా.
కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మలు మాత్రం రెండో మ్యాచ్‌లో ఆడించాలనుకున్నారు. నేను బుమ్రాతో మాట్లాడితే.. మొదటి మ్యాచ్ ఆడతానన్నాడు. సెకండ్ మ్యాచ్ ఆడమని నేను చెప్పాను. సాయంత్రం మమ్మల్ని స్కాన్ కోసం రమ్మని కబురు వచ్చింది.

బుమ్రా గాయం పెద్దదని ముందే అనుకున్నా..
రెండో మ్యాచ్ మధ్యలో సాయంత్రం మళ్లీ స్కాన్ కోసం తీసుకెళ్లబోతున్నామని నాకు సందేశం వచ్చింది. ఫిట్‌గా లేకుండా ఒకటి రెండు మ్యాచ్‌ల్లో జస్ప్రీత్ బుమ్రాను ఆడిస్తే.. అతను కనీసం ఒక సంవత్సరం పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వస్తుందనుకున్నా. ఇక బుమ్రా గాయం చాలా పెద్దదని తేలింది. అప్పుడు టీమ్ మేనేజ్‌మెంట్ అతన్ని ప్రపంచకప్ 2022 నుంచి తప్పించాలని నిర్ణయించుకుంది' అని చేతన్ శర్మ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications












