Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిట్‌నెస్ కోసం భారత ఆటగాళ్లు ఇంజెక్షన్లు తీసుకుంటారు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు!

BCCI chief selector Chetan Sharma says Indias cricketers take injections to prove fitness

న్యూఢిల్లీ: ఫిట్‌నెస్ కోసం టీమిండియా ఆటగాళ్లు ఇంజెక్షన్లు తీసుకుంటారని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. జీ న్యూస్ స్ట్రింగ్ ఆపరేషన్‌లో.. మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో పాటు భారత ఆటగాళ్ల గురించి ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపాయి.

కెప్టెన్సీ విషయంలో విరాట్‌ కోహ్లీ అబద్ధం చెప్పాడని, జట్టులో రెండు వర్గాలు ఉన్నాయని తెలిపాడు. పూర్తిస్థాయి ఫిట్‌నెస్ లేకున్నా భారత ఆటగాళ్లు ఇంజెక్షన్ల సాయంతో మ్యాచ్‌లు ఆడుతారని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలు తనను గుడ్డిగా నమ్ముతారని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు.. ప్రపంచ క్రికెట్ ముందు టీమిండియాను దోషిగా నిలబెట్టాయి.

బుమ్రా కూడా ఇంజెక్షన్లతోనే..

బుమ్రా కూడా ఇంజెక్షన్లతోనే..

ఆఫ్ ద రికార్డుగా చేతన్ శర్మ ఈ వ్యాఖ్యలు చేయగా.. జీన్యూస్ రిపోర్టర్ స్పై కెమెరాతో వీటిని రికార్డు చేశాడు. 'భారత క్రికెటర్లు 80 శాతం ఫిట్‌గా ఉన్నా సరే.. ఇంజెక్షన్లు తీసుకుని 100 శాతం ఫిట్‌నెస్‌ సాధిస్తారు. అవి నొప్పి మందులు కావు. డోప్‌ టెస్టుల్లో పట్టుబడని ఉత్ప్రేరకం ఉన్న మందులను వాడతారు. సరైన ప్రదర్శన చేయలేని కొందరు ఆటగాళ్లు కూడా ఈ ఇంజెక్షన్లను ఉపయోగిస్తున్నారు. జస్‌ప్రీత్ బుమ్రా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించకముందే ఈ ఇంజెక్షన్ల సాయంతో మ్యాచ్‌లు ఆడించారు. అతను ఇప్పటికీ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేదు.

జట్టులో రెండు వర్గాలు..

జట్టులో రెండు వర్గాలు..

భారత జట్టులో రెండు వర్గాలు ఉన్నాయి. ఓ వర్గాన్ని రోహిత్‌ శర్మ నడిపిస్తే, మరొకటి విరాట్ కోహ్లీ నేతృత్వంలో నడుస్తుంది. అయితే కోహ్లీ, రోహిత్‌ శర్మ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. కోహ్లీ ఫామ్‌ కోల్పోయి ఇబ్బందిపడ్డపుడు రోహిత్‌ శర్మ అండగా నిలిచాడు. రోహిత్‌, కోహ్లి మధ్య అహం సమస్యగా మారినా.. మీదికి మంచిగా ఉన్నట్లుగానే ఉంటుంది. రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యాలు నన్ను గుడ్డిగా నమ్ముతారు. ఆ ఇద్దరూ మా ఇంటికి వచ్చారు. హార్దిక్‌ పాండ్యా తరచుగా నన్ను కలుస్తాడు.

కోహ్లీ అబద్దం ఆడాడు..

కోహ్లీ అబద్దం ఆడాడు..

కెప్టెన్సీ విషయంలో సెలక్టర్లు ప్రయోగాలు చేయాలనుకున్నారు. అందుకే గత కొన్నేళ్లలో చాలామంది కెప్టెన్లను మార్చి చూశాం. కోహ్లీ కెప్టెన్‌గా ఉండగా మాత్రం అతనే మూడు ఫార్మాట్లలోనూ సారథిగా కొనసాగుతాడని మాకు చెప్పారు. కోహ్లీని నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించాలన్నది గంగూలీ నిర్ణయం కాదు. ఉమ్మడిగా తీసుకున్నది. పరిమిత ఓవర్ల క్రికెట్లో జట్టుకు ఒకే కెప్టెన్‌ ఉండాలని అనుకుంటున్నట్లు విరాట్‌ కోహ్లీకి ముందే చెప్పాం. తొలుత టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు కోహ్లీ ప్రకటించినప్పుడు.. మరోసారి ఆలోచించుకోవాలని గంగూలీ చెప్పాడు. సమావేశంలో మేము తొమ్మిది మంది ఉన్నాము. కోహ్లీ విన్నాడో లేదో కానీ.. గంగూలీ తనను కొనసాగమని చెప్పలేదని అబద్ధం చెప్పాడు.

గంగూలీతో కోహ్లీకి విభేదాలు..

గంగూలీతో కోహ్లీకి విభేదాలు..

పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పించడంతో అహం దెబ్బ తిని అతను గంగూలీని విలేకరుల సమావేశంలో నిందించాడు. తనపై వేటు పడడానికి గంగూలీనే కారణమని అతను భావించాడు. కోహ్లీకి, గంగూలీకి మధ్య విభేదాలు ఉండేవి. తాను బీసీసీఐ కంటే ఎక్కువ అని విరాట్‌ భావించేవాడు. రవిశాస్త్రి కోచ్‌ కావడంలో కోహ్లీది కీలక పాత్ర. శుభ్‌మన్‌ గిల్‌కు అవకాశం ఇవ్వడం కోసం కోహ్లీ, రోహిత్‌ లాంటి పెద్ద స్టార్లకు టీ20 ఫార్మాట్‌ నుంచి విశ్రాంతినిచ్చాం. భవిష్యత్తులో రోహిత్‌ శర్మ టీ20 క్రికెట్‌ ప్రణాళికల్లో ఉండడు. హార్దిక్‌ పాండ్యానే దీర్ఘ కాలం కెప్టెన్‌గా కొనసాగుతాడు.'అని చేతన్ శర్మ నోరు జారాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

Story first published: Wednesday, February 15, 2023, 8:23 [IST]
Other articles published on Feb 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+