
రహానే, ఇషాంత్‌పై వేటు..
వన్డే ఫార్మాట్‌తో పాటు టీ20ల్లో ఇషాన్ కిషన్ కొనసాగే అవకాశం ఉండటంతో అతనికి సీ లేదా బీ కాంట్రాక్టు లభించవచ్చు. ఇక యువ ఆటగాళ్లకు కాంట్రాక్టులు ఇవ్వనున్న బీసీసీఐ సీనియర్ ఆటగాళ్లపై వేటు వేయనుంది. వయో భారంతో పాటు టెస్ట్ ఫార్మాటే ఆడుతూ.. పేలవ ఫామ్‌తో జట్టుకు దూరమైన వెటరన్ ప్లేయర్స్ అజింక్యా రహానే, ఇషాంత్ శర్మ, వృద్దిమాన్ సాహాల కాంట్రాక్టులను బీసీసీఐ తొలగించే అవకాశం ఉంది. ఇప్పటికే వీరి కెరీర్‌లకు అనధికారికంగా ఎండ్ కార్డ్ వేసిన బీసీసీఐ.. త్వరలోనే సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి కూడా తప్పించనున్నట్టు సమాచారం.

హార్దిక్ పాండ్యాకు ప్రమోషన్..
బీసీసీఐ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం రహానే, ఇషాంత్ శర్మ, సాహాలకు సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి తప్పించి యువ ప్లేయర్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యాకు ప్రమోషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రహానే, ఇషాంత్ శర్మలు గ్రేడ్ - బీలో ఉండగా.. వృద్ధిమాన్ సాహా గ్రేడ్ - సీలో ఉన్నాడు.
ఈ ముగ్గురూ కాంట్రాక్టులు కోల్పోతే ఇక తర్వాత జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమే. ఇక సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్ లు ప్రస్తుతం గ్రేడ్ - సీలో ఉండగా వీరికి ప్రమోషన్ దక్కనుంది. హార్ధిక్ పాండ్యా కూడా గ్రేడ్-సీలోనే ఉన్నాడు. గాయం నుంచి కోలుకున్నాక పాండ్యా అద్భుత ఆటతో మెప్పిస్తున్నాడు. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్ అందించాక అతడిని టీ20 కెప్టెన్ చేయాలనే డిమాండ్ మొదలైంది.

కాంట్రాక్టుల క్రిటేరియా ఏంటంటే..?
గ్రేడ్ ఏ+: మూడు ఫార్మాట్లు ఆడాలి
గ్రేడ్ ఏ: మూడు ఫార్మాట్లు లేదా టెస్ట్ ఫార్మాట్‌తో కలిపి రెండు ఫార్మాట్లు
గ్రేడ్ బీ: ఏవైనా రెండు ఫార్మాట్లు
గ్రేడ్ సీ: సింగిల్ ఫార్మాట్ ప్లేయర్
2022-23 బీసీసీఐ కాంట్రాక్టులు..
గ్రేడ్ ఏ+ - రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా (ఈ గ్రూప్ లో ఉన్నవాళ్లకు వార్షిక వేతనం రూ. 7 కోట్లు)
గ్రేడ్ ఏ - అశ్విన్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, కెఎల్ రాహుల్, మహ్మద్ షమీ (ఈ గ్రూప్ ఆటగాళ్లకు రూ. 5 కోట్ల వేతనం లభిస్తుంది)
గ్రేడ్ బి - ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ (వీరికి రూ. 3 కోట్ల వార్షిక వేతనం)
గ్రేడ్ సి - శిఖర్ ధావన్, ఉమేశ్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, శుభమన్ గిల్, హనుమా విహారి, యుజ్వేంద్ర చాహల్, సూర్యకుమార్ యాదవ్, వృద్ధిమాన్ సాహా, మయాంక్ అగర్వాల్, దీపక్ చాహర్ (వీళ్లకు యేటా రూ. 1 కోటి వేతనం)


Click it and Unblock the Notifications












