BCCI review meeting:టీమిండియా టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రోహిత్ శర్మ!

న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలకు పిలుపు అందినట్లు తెలుస్తోంది. ముంబై వేదికగా జరిగే రివ్యూ మీటింగ్‌కు హాజరుకావాలని ఈ ముగ్గురిని ఆహ్వానించినట్లు సమాచారం. బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే ముందు ఈ మీటింగ్ నిర్వహిస్తారని బోర్డుకు చెందిన ఓ అధికారి తెలిపాడు.
టీ20 ప్రపంచకప్ వైఫల్యంతో పాటు భారత జట్టులో తీసుకురావాల్సిన మార్పులపై ఈ మీటింగ్‌లో ప్రధానంగా చర్చించనున్నారట. వేర్వేరు కెప్టెన్లు, కోచ్‌ల పద్దతిని అమలు చేయడంపై కూడా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ అధ్యక్షతన జరిగే ఈ రివ్యూ మీటింగ్‌కు వేటుకు గురైన సెలెక్షన్ కమీటి చైర్మన్ హాజరవుతారని సమాచారం.

కొత్త కోచ్.. కెప్టెన్..
'బీసీసీఐ ప్రత్యేకమైన సమావేశం నిర్వహించనుంది. అయితే అది ఎప్పుడనేది ఖచ్చితంగా చెప్పలేను. రోహిత్, ద్రవిడ్ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లేముందే ఈ సమావేశం ఉండనుంది. కొన్ని విషయాలపై సీరియస్‌గా చర్చించనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ కావాల్సిన ప్రణాళికలపై మాట్లాడనున్నారు. జట్టులో కావాల్సిన మార్పుల గురించి రోహిత్, రాహుల్ అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఫార్మాట్‌కో కెప్టెన్, కోచ్‌లు నియమించడంపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు.'అని ఓ సీనియర్ బీసీసీఐ అధికారి ఇన్‌సైడ్ స్పోర్ట్ వెబ్‌సైట్‌కు తెలిపాడు.

బీసీసీఐ స్పెషల్ మీటింగ్ ఎజెండా..
స్ప్లిట్ కోచింగ్(టీ20లకు ప్రత్యేకంగా కోచ్)
స్ప్లిట్ కెప్టెన్సీ(రోహిత్ శర్మను వన్డేలకు పరిమితం చేసి హార్దిక్ పాండ్యాను టీ20 కెప్టెన్‌గా నియమించడం)
టీ20 ప్రపంచకప్ రివ్యూ
ప్రస్తుత కోచ్‌ల పెర్ఫామెన్స్‌పై రివ్యూ
సెలెక్షన్ కమిటీ రొటేషన్ పాలసీ
క్రికెట్ అడ్వైజరీ కమిటీ నియామకం

మీటింగ్‌లో పాల్గొనేవారు ఎవరంటే..?
రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, సెక్రటరీ జైషా, బీసీసీఐ ట్రెజరర్ ఆశిష్ షెలార్, చేతన్ శర్మ(మాజీ చీఫ్ సెలెక్టర్)

రోహిత్ గ్రీన్ సిగ్నల్..
టీ20 కెప్టెన్సీ మార్పుకు రోహిత్ శర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు. 'మేం మరో ప్రపంచకప్ ఓడిపోయేందుకు సిద్దంగా లేం. ఎట్టి పరిస్థితుల్లో ఆ పరిస్థితి రానివ్వం. ఇప్పటికే రోహిత్ శర్మతో స్ప్లిట్ కెప్టెన్సీ గురించి మాట్లాడాం. అతను సానుకూలంగా స్పందించాడు. రాహుల్ ద్రవిడ్‌తో కూడా చర్చించనున్నాం. అతనిపై ఉన్న వర్క్‌లోడ్‌ను తగ్గించాలనుకుంటున్నాం. త్వరలోనే అతన్ని కలిసి ఈ విషయంపై మాట్లాడుతాం'అని బీసీసీఐ టాప్ అధికారి ఒకరు పేర్కొన్నారు. టీ20 ఫార్మాట్ కోచింగ్ బాధ్యతలను ఆశిష్ నెహ్రాకు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications