Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ కోహ్లీకి వార్నింగ్ ఇచ్చిన బీసీసీఐ!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కన్నెర్ర చేసింది. యో యో టెస్ట్ వివరాలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం సరికాదని పేర్కొంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేయకపోయినా.. ఆటగాళ్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

ఆసియా కప్ 2023 ప్రిపరేషన్‌లో భాగంగా జట్టులోకి ఎంపికైన వారి కోసం బీసీసీఐ యో-యో టెస్టును నిర్వహించింది. తప్పనిసరి కాకపోయినా ప్రతీ ఒక్కరూ హాజరు కావాలని పేర్కొంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ సహా పలువురు ఆటగాళ్లకు యోయో టెస్టు ముగిసింది. ఇక విరాట్ కోహ్లీ తన టెస్టు స్కోరును సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

bcci-bosses-angers-virat-kohlis-instagram-story-india-cricketers-get-verbal-warning

యో-యో టెస్టులో 17.2 స్కోరు వచ్చినట్లు తెలిపాడు. బీసీసీఐ కనీస స్కోర్ 16.5. విరాట్ కోహ్లీ చేరుకున్నప్పటికీ.. కొందరు ఆ మార్క్‌ను తాకలేదని ప్రచారం జరిగింది. దీంతో సోషల్‌ మీడియాలో కొత్త చర్చకు తెరలేస్తుందేమోనని భావించిన బీసీసీఐ.. ఆటగాళ్లకు కీలక సూచనలు చేసింది. ఎవరూ సోషల్ మీడియా వేదికగా యో-యో టెస్టు రిజల్ట్స్‌ను పంచుకోవద్దని హెచ్చరించింది.

'సోషల్ మీడియా వేదికగా ఇలాంటి అధికారిక రహస్య విషయాలను వెల్లడించవద్దు. తమ శిక్షణ సందర్భంగా దిగిన ఫొటోలను కొందరు ఆటగాళ్లు అభిమానులతో పంచుకుంటున్నారు. అదేవిధంగా టెస్టుల స్కోరుకు సంబంధించిన విషయాలను కూడా పంచుకుంటున్నారు. ఇది బీసీసీఐ కాంట్రాక్ట్‌ క్లాజ్‌ ధిక్కరణ కిందకు వస్తుంది.

ఇలాంటివి చేయ వద్దని మౌఖింగా ఆదేశాలు ఇచ్చాం'అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఆసియా కప్‌ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుండగా.. టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో ఆడనుంది. బెంగళూరు వేదికగా టీమిండియా ప్రాక్టీస్ క్యాంప్ ప్రారంభించింది. రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ప్రాక్టీస్ శిభిరానికి

Story first published: Friday, August 25, 2023, 16:44 [IST]
Other articles published on Aug 25, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+